కూటమికి భారీ మెజార్టీ: నందమూరి రామకృష్ణ

అమరావతి, మహానాడు: తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల గురించి ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ ఒక వీడియో రిలీజ్‌ చేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఓటింగ్‌ జరిగింది. తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు… పక్కనున్న రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన తెలుగు వారు తరలివచ్చి ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. వారందరికీ పేరుపేరునా ధన్యవా దాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి భారీ మెజారిటీతో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు..ఇది తథ్యమని స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు భారీ ఎత్తున ఓట్లు వేసిన తెలుగుజాతికి టీడీపీ తరపున, తమ కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు.