‘‘రివర్స్ టెండరింగ్’’ పేరుతో స్వామికే పంగనామాలు
తక్షణమే పైల్స్‌ను స్వాధీనం చేసుకోవాలి
సీఐడీతో విచారణ జరిపించాలి
బీజేపీ నాయకుడు నవీన్‌కుమార్ రెడ్డి
తిరుపతి: టీటీడీ ఇంజనీరింగ్ టెండర్లలో భారీ కుంభకోణం బీజేపీ నాయకుడు నవీన్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. సీఐడీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి టీటీడీ ఇంజనీరింగ్ ఫైల్స్‌ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించాలని, లేనిపక్షంలో కంప్యూటర్ల నుంచి తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. టీటీడీలో ‘‘రివర్స్ టెండరింగ్’’ పేరుతో మూడు నామాల స్వామికే పంగనామా లు పెట్టారని, ధర్మారెడ్డి ధర్మకర్తల మండలి మెప్పుకోసం పనిచేసిన ప్రధాన గణాంకాధికారి, చీఫ్ ఇంజనీర్ ఇంజినీరింగ్ టెక్నికల్ అడ్వైజర్‌లను విచారిం చాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోని డీఆర్ మహల్ దగ్గర గోవిందరాజ సత్రాలను ఆగమేఘాల మీద కూల్చివేసి పునర్నిర్మాణం కోసం 600 కోట్ల రూపాయలను ఒక్కసారిగా కమీషన్ల కోసం కేటాయించడం దుర్మార్గమన్నారు. టీటీడీలో ఐదేళ్లుగా ధర్మకర్తల మండలిలో ఇంజనీరింగ్ పనుల కోసం ఎన్ని కోట్లు మంజూరు చేశారు? ఎంత ఎక్సెస్ పర్సంటేజ్‌కు టెండర్లు ఆమోదించి కమీషన్లు దండుకున్నారో నిగ్గు తేల్చాలని కోరారు.
కమీషన్ల కోసం ఏకంగా రూ.1500 కోట్ల బడ్జెట్
టీటీడీ ఇంజనీరింగ్ శాఖకు గతంలో ప్రతి ఏటా 150 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఇటీవల ఉన్నఫలంగా ఏకంగా రూ.1,500 కోట్లను టీటీడీ ప్రధాన గణాం కాధికారి ఎవరి అనుమతితో ఆమోదముద్ర వేశారో కాగ్‌తో ఆడిట్ జరిపించేలా ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. స్విమ్స్ హాస్పిటల్‌లో రెనోవేషన్, మెయింటెనెన్స్ పేరుతో కేటాయించిన సుమారు రూ.200 కోట్ల పనులపై సీఐడీ అధికారులు దృష్టి సారిస్తే భారీ కుంభకోణం వెలుగులోకి వస్తుందన్నారు. టీటీడీ లో శ్రీవారి సొమ్మును ఇంజనీరింగ్ పనుల పేరుతో మంచినీళ్లలా టేబుల్ అజెం డా కింద ఆమోదముద్ర వేసుకుని అధిక శాతానికి కొంతమంది కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెట్టి కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు.