హైడ్రా అంటే ఒక భరోసా!

– కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్‌, మహానాడు: హైడ్రా అంటే ఒక భరోసా అని… ప్రజల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉంటుందని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే… మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఎక్కువుగా సోషల్ మీడియానే హైడ్రాను ఎక్కువగా ప్రచారం చేస్తోంది. అమీన్ పూర్ లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయి. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తామన్న ధీమాతో కొందరు కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు.

ఎన్‌ కన్వెన్షన్ కూల్చినప్పుడు పక్కన ఉన్నటువంటి గుడిసెలను తొలగించలేదు. కొందరు అక్రమంగా బిజినెస్ లు చేస్తూ… హైడ్రా వచ్చినప్పుడు కిరోసిన్, పెట్రోల్ తో ఆందోళన చేస్తున్నారు. కూకట్ పల్లి చెరువు దగ్గర ఉన్నవారికి ముందస్తు సమాచారం ఇచ్చాం. కొందరు సిరియస్ తీసుకోలేదు… అయిన వారిని ఖాళీ చేయించిన తరువాతనే కూల్చివేతలు స్టార్ట్ చేశాం. హైడ్రా అనేది ఒక బూచిగా చూపించి బుచ్చమ్మను భయబ్రాంతులకు గురిచేశారు.

కొందరు హైడ్రాను బూచిగా చూపిస్తున్నారు.. అది సరైంది కాదు. పేద వాళ్ళనీ ఇబ్బందులు గురిచేసేందుకు హైడ్రా ఉండదు. ఇప్పటి వరకు హైడ్రా కూల్చింది ఖాళీగా ఉన్న భవనాలు మాత్రమే. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఒవైసీ కాలేజీలు బఫర్ జోన్ లో ఉన్నట్టు మాకు ఫిర్యాదులు వచ్చాయి. పిల్లల అకడమిక్ సంవత్సరం నష్టం జరుగుతుందని ఆలోచన చేస్తున్నాం. పేదల పట్ల ఒకలా, పెద్దోళ్ల పట్ల మరోలా హైడ్రా వ్యవరించదు. అక్రమంగా నిర్మించిన పెద్ద వాళ్ళే ప్రథమ టార్గెట్ గా హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. హైడ్రా సైలెంట్ గా ఏమి లేదు.. హైడ్రా పని హైడ్రా చేస్తుంది.