జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు

– రంగాళ్‌కుంట చెరువులోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ

హైదరాబాద్: నటుడు, నిర్మాత మురళీ మోహన్‌కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా షాకిచ్చింది. హైదరాబాద్ నగరంలోని రంగాళ్‌కుంట చెరువులోని అక్రమ నిర్మాణాలను తొలగించాలని నోటీసులు జారీ చేసింది.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగాళ్‌కుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలను తొలగించాలని అందులో పేర్కొంది. హైడ్రా నోటీసులపై జయభేరి సంస్థ స్పందించాల్సి ఉంది. మరోవైపు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ భాగీరథమ్మ చెరువును పరిశీలించారు.