అన్న ప్రసాదం స్వీకరించడం ఆనందంగా ఉంది

– అధికారులకు, సిబ్బందికి అభినందనలు

– చింతకాయల అయ్యన్నపాత్రుడు, స్పీకర్.

తిరుమల, మహానాడు: తిరుమల తిరుపతి దేవస్థానంలో 1985లో దివంగత నందమూరి తారక రామారావు రోజుకి 2,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు అది రోజుకి 1,00,000 మందికి భోజన వసతి కల్పించే కార్యక్రమంగా మారింది. దీనికి సహకరించిన భక్తులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని రోజు పవిత్రమైన మనసుతో అమలు చేస్తున్న అధికారులు, సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రోజు(శుక్రవారం) నేను నా కుటుంబంతో సహా అన్న ప్రసాదం స్వీకరించడం ఆనందంగా ఉంది. ఈ ప్రసాదం చాలా రుచిగా ఉంది. శుభ్రత కూడా పాటిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారిని అభినందిస్తున్నాను.