దర్శి సంక్షేమం, అభివృద్ధి బాధ్యత నాది

– డాక్టర్‌ లక్ష్మి కి మంత్రి నారా లోకేష్ హామీ

అమరావతి, మహానాడు: దర్శి సంక్షేమం, అభివృద్ధి బాధ్యత నాదని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేందుకు మీరు వారధులుగా పని చేయాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. మంత్రిని మంగళవారం లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్‌ మంగళగిరి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వంద రోజుల ప్రభుత్వ పాలనపై యువనేత లోకేష్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా లక్ష్మి కొనియాడారు. అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ మనది అభివృద్ధి బాట, వైసీపీ విధ్వంసాల బాట అందుకే మీరు కూడా ప్రజాసేవలో ప్రతినిత్యం ఉంటూ ప్రభుత్వ పథకాలను అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించాలని కోరారు.

దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వపరంగా అన్ని విధాల అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. అధికారులతో సమన్వయం చేసుకొని కూటమి ప్రజా పాలన దర్శిలో ప్రతి ఇంటికి చేరేందుకు మీరు ప్రతినిధిగా పనిచేయాలన్నారు. మీరు చేస్తున్న కృషిని నేను చూస్తున్నానని, ఒక మహిళా డాక్టర్ గా మీ సమయాన్ని ప్రజల కోసం కేటాయిస్తూ పనిచేస్తున్న విధానంపై ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోందని ప్రశంసించారు. తక్కువ సమయంలో ప్రజా హృదయాలను గెలుచుకున్నారని, సాంకేతికంగా మీరు ఓడినా చోటే ప్రభుత్వం ప్రతినిధిగా దర్శి లో పనిచేయాలని కోరారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజల్లో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు.

తుపాను విరాళాలు సేకరించడంలో మీరు చూపిన చొరవ అభినందనీయమని, అదేవిధంగా పెన్షన్లు పంపిణీ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే జాబ్ మేళా, మెగా మెడికల్ క్యాంపు ద్వారా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు ఇలా…. అనేక అనేక కార్యక్రమాలు మీరు చేస్తున్న కృషి నాకు తెలుసునని మంత్రి లోకేష్‌ అభినందించారు. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ ఇన్‌చార్జిగా దర్శి నియోజకవర్గం లో పార్టీని బలోపేతం చేస్తూ పార్టీలో అందరిని కలుపుకొని ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన ప్రతినిధి మీరే అని ఆయన అన్నారు. దర్శిలో తెలుగుదేశం పార్టీని పటిష్ఠపరిచేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. కాగా, లక్ష్మి మాట్లాడుతూ ఇలా లోకేష్ తో, పల్లా శ్రీనివాస్ తో భేటీ ఎంతో స్ఫూర్తిని కలిగించిందన్నారు. దర్శి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ జరిగిందని, లోకేష్ సహకరిస్తానని హామీ ఇచ్చారని లక్ష్మి, లలిత్ సాగర్ లు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్‌కు, శ్రీనివాస్‌ వారు కృతజ్ఞతలు తెలిపారు.