– ప్రత్యర్థులు దాడి చేస్తే సహించం
– దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి హెచ్చరిక
దర్శి, మహానాడు: ప్రజా విశ్వాసం కోల్పోయినా వైసీపీ వారిలో మార్పు రాలేదు… దర్శి ప్రాంతంలో కూటమి కార్యకర్తలపై వైసీపీ దాడులు చేస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి హెచ్చరించారు. వినాయక నిమజ్జనం సాకుగా చూపుతూ కురిచేడు మండలం, దేకనకొండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ వాళ్ళు దాడులు చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. దాడిలో గాయపడి, దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాదాపు పది మంది తెలుగుదేశం శ్రేణులను మంగళవారం సాయంత్రం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, పార్టీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు పరామర్శించి వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడారు.
ప్రతి తెలుగుదేశం కార్యకర్త రక్షణ బాధ్యత నాదని, వైసీపీ దాడులు దౌర్జన్యాలు చేస్తే సహించేది లేదని, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కోరారు.