నాపై విచారణను స్వాగతిస్తున్నా

ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదు
అభివృద్ధిని ఓర్వలేని వ్యక్తులే ఫిర్యాదు చేశారు
కాకతీయ వైస్‌ ఛాన్సలర్‌ తాటికొండ రమేష్‌

వరంగల్‌, మహానాడు : కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా మూడేళ్ల కాలంలో ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని ప్రొఫెసర్‌ తాటికొండ రమేష్‌ తెలిపారు. తనపై విజిలెన్స్‌ విచారణను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మూడేళ్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని యూనివర్సిటీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేశాను. ఆ ఫలితమే న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌. జాతీయ కాంగ్రెస్‌ నిర్వహించాం. మూడేళ్లలో యూనివర్సిటీ సిబ్బందికి, రిటైర్డ్‌ ఉద్యోగులకు అన్ని బకాయిలు అందించాం. 507 మంది దినసరి, తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు 3 నుంచి 4 రెట్లు పెంచాం. ఒకవైపు అధ్యాపకుల కొరత ఉన్నప్పటికీ 300 మందికి పైగా పీహెచ్‌ డీ అడ్మిషన్లు అన్ని రకాల రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్‌ అనుసరిస్తూ ప్రవేశాలు కల్పించాం. దొడ్డి దారిలో ప్రమోషన్ల పొందాలని చూసే వ్యక్తులు, అభివృద్ధిని ఓర్వలేక దిగజార్చే ప్రయత్నించే వారు, అక్రమ అడ్మిషన్లు కావాలని గగ్గోలు పెట్టే వారు ఫిర్యాదు చేశారని వ్యాఖ్యానించారు.