మీ కష్టం మరువను

మీ అందరి కష్టం వల్లే నేను ఎంపిగా గెలిచా
బుద్దా వెంకన్న నా సీటు కోసం చాలా కష్టపడ్డారు
– విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని

విజయవాడ: నేను ఎప్పుడూ అందరి మనిషిని, ప్రజల మనిషిని. బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ప్రోత్సాహం తోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. కేశినేని నాని ఆనాడు చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి. చంద్రబాబు కు నేను మొదటి నుంచీ అభిమానిని. ఆయన సారధ్యంలో పని చేసే అవకాశం నాకు వచ్చింది.

మీ అందరి కష్టం వల్లే నేను ఎంపిగా గెలిచాను. ఇంత భారీ విజయం తో నాపై బాధ్యత మరింత పెరిగింది. నా శక్తి వంచన లేకుండా అభివృద్ధి కోసం పని చేస్తా. ఉడతా భక్తిగా నా వంతు‌ సేవా కార్యక్రమాలు చేస్తా. బుద్ధా వెంకన్న, నా లాంటోళ్లు మనసులో పెట్టుకుని పైకి వేరే మాట్లాడం. మాకు ఏదనిపిస్తే అదే ఓపెన్ గా చెబుతాం. టీడీపీ కోసం పని చేసిన వారికి మంచి గుర్తింపు ఉంటుంది.

పార్టీ అధిష్టానం మన కృషి కి తగిన విధంగా గుర్తిస్తుంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరం‌ కలిసి పని చేద్దాం. గత నాయకుడి ఒంటెద్దు పోకడలు మరచిపోండి. ఇక నుంచి మనమంతా ఒకటి. నాకు మీరు అండగా నిలిచిన తీరు ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటా. పార్లమెంటు సమావేశాలు అయ్యాక మళ్లీ ఇక్కడే సమావేశం పెట్టుకుందాం.

బుద్దా వెంకన్న ఆయన సీటు కన్నా..‌నా సీటు కోసం చాలా కష్టపడ్డారు. నాగుల్ మీరా కూడా నా కోసం పని చేశారు. మీరు ఇచ్చిన సహకారం, మీరు పడిన కష్టం నేను మరువను. కూటమి పొత్తు వల్ల సీనియర్ నాయకులకు అన్యాయం జరిగింది. కానీ భవిష్యత్తు లో అందరికీ న్యాయం చేసేలా నా వంతు కృషి చేస్తా. కార్యకర్తలు నుంచి నాయకుల వరకు నాతో నడిచిన అందరినీ గుర్తు పెట్టుకుంటా. మనందరం టిడిపి అభివృద్ధి కోసం పని‌ చేద్దాం.