– బ్రాహ్మణ సమాజానికి అన్ని విధాలుగా అండగా ఉంటాను
– తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కమ్యూనిటీ భవన్
– ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్ధన రావు
ఒంగోలు, మే 3: బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తానని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ఒంగోలు నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం గోల్డెన్ సిల్వర్ మర్చంట్ అసోసియేషన్ హాల్ నందు జరిగిన కార్యక్రమలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా బ్రాహ్మణులు ఆదుకుందని కార్పొరేషన్ ద్వారా పలు సబ్సిడీ రుణాలు పెన్షన్లు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బ్రాహ్మణులకు కమ్యూనిటీ హాల్ నిర్మించి అందులో ఉచితంగా వివాహ వివాహ తదితర శుభకార్యాలు చేసుకొనడానికి ఏర్పాటు చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుజ్జి రాంప్రసాద్ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి కోఆర్డినేటర్ టీవీ శ్రీరామ్ మూర్తి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కామరాజు గడ్డ కుసుమకుమారి బ్రాహ్మణ సాధికార సమితి అధికార ప్రతినిధి ఈమని సూర్యనారాయణ, పల్నాడు సాధికార సమితి నాయకులు గూడూరి శేఖర్, ఒంగోలు పార్లమెంట్ సాధికార సమితి కన్వీనర్ మేడవరం మల్లికార్జున్ శర్మ, ఒంగోలు పట్టణంలోని బ్రాహ్మణ పెద్దలు పలువురు పాల్గొని ప్రసంగించారు. ప్రముఖ వేద పండితుల నేలపట్ల సదాశివయ శాస్త్రి వేద ఆశీర్వచనము చేశారు. కార్యక్రమంలో ఎస్.ఎ.టి. రాజేష్, గంజాం శ్రీ రంగనాథ్ ప్రసాద్, వ్యామిజాలా ప్రసన్నకుమార్, డా. లంకా ప్రసన్నకుమార్, దేనువుకొండ సుబ్బయ్య, ముక్తినూతలపాటి వాసు ఎస్ వి సుజాత తదితరులు పాల్గొన్నారు.