ప్రజల కష్టాలను గుర్తించి పరిష్కరించినపుడే ఎమ్మెల్యేగా గెలిచినట్లు

-తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
-నకరికల్లు మండలంలోని మంచినీటి చెరువును అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు

నియోజకవర్గ ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చొరవ చూపుతున్నట్లు ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు.ఈ మేరకు నకరికల్లు మండలం నకరికల్లు,శాంతినగర్ వద్దనున్న మంచినీటి చెరువులను అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని పరిష్కరించే వరకు తప్పకుండా శ్రమిస్తానన్నారు.అధికారులు కూడా ఈ విషయంలో చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, దోపిడీ కారణంగా ప్రజలు గుక్కెడు మంచినీటి కోసం కూడా అవస్థలు పడాల్సి వచ్చిందన్నారు. కానీ ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత నా పై ఉందని, చిరకాలంగా అపరిస్కృతంగా నిలిచిపోయిన తాగునీటి సమస్యను పరిష్కరించి చూపుతానని ఎమ్మెల్యే డా.చదలవాడ అరవింద బాబు అన్నారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ రవి చంద్ర రెడ్డి,డీ ఈ శ్రీనివాస్ రావు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.