సైనికుడిలా పనిచేస్తా

– బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి

ప్రజలు ఆశీర్వదిస్తే సైనికుడిలా పని చేసి విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. మండల బీజేపీ అధ్యక్షుడు కంచంపల్లి హరి నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 53వ డివిజన్ బీజేపీ కార్యాలయాన్ని శుక్రవారం సుజనా చౌదరి ప్రారంభించారు.ఎన్నికల్లో ప్రజలందరూ తనకు ఓటు వేసి గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సూపర్ సిక్స్ పథకాలను ఎన్డీయే కూటమి మేనిఫెస్టోను రూపొందించామన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం సేవకుడిలా కష్టపడతానన్నారు.

ప్రజలందరూ భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల గోవింద్, 53వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి భాస్కర్, మహదేవ్ సురేష్, 52వ డివిజన్ అధ్యక్షుడు పగడాల లక్ష్మణ్, బీజేపీ డివిజన్ అధ్యక్షురాలు ఒమ్మి అన్నపూర్ణ, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.