– బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శ
తెలంగాణ భవన్, మహానాడు: రాష్ట్రంలో విద్యాశాఖ, క్రీడా శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు… స్పోర్ట్స్ యూనివర్సిటీపై సీఎం ఆఫీసుకు లేఖ రాసినా స్పందన లేదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన బుధవారం తెలంగాణ భవన్‌లో విలేఖర్లతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనే దోమలగూడలో వ్యాయామ విద్యా కళాశాలను స్పోర్ట్స్ యూనివర్సిటీ చేయాలని అనుకున్నాం… తొలి విడతగా పక్కా భవనాల కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీకి కేసీఆర్ 20 కోట్లు కేటాయించారు… క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది… దోమలగూడలో ఉన్న వ్యాయామ విద్యా కళాశాలలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మించాలి…
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో వచ్చిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోమలగూడ వ్యాయమ విద్యా కళాశాలపై వివక్ష చూపవద్దు.. రాష్ట్రం మొత్తమ్మీద వ్యాయామ విద్యా కళాశాల ఉన్నది దోమలగూడలోనే… స్పోర్ట్స్ యూనివర్సిటీపై ప్రభుత్వం పెద్ద,పెద్ద మాటలు చెప్తోందన్నారు.