హైదరాబాద్: పది యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను ప్రభుత్వం నియమించింది. ఇన్‌ఛార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దానకిషోర్, జేఎన్‌టీయూ వీసీగా బి.వెంకటేశం, కాకతీయ యూనివర్సిటీ వీసీగా వాకాటి కరుణ, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వి, తెలంగాణ యూనివర్సిటీ వీసీగా సందీప్ సుల్తానియా, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వీసీగా శైలజా రామయ్యర్, మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్సిటీ వీసీగా సురేంద్రమోహన్, జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ వీసీగా జయేష్ రంజన్, పాలమూరు యూనివర్సిటీ వీసీగా నదీం అహ్మద్ నియమితులయ్యారు.