దుర్భరంగా ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డు!

ఇబ్రహీంపట్నం, మహానాడు: ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్డులో ప్రయాణం అత్యంత దుర్భరంగా మారింది. నిత్యం వందలాది భారీ లోడుతో బూడిద లారీలు తిరుగుతున్నాయి. బూడిద పై కోట్లాది వ్యాపారం జరుగుతోంది. రవాణా పెరగటంతో స్థానిక ప్రజలకు కష్టాలు కూడా పెరిగాయి. మరోసారి బూడిద పట్నం పేరు అందరి నోట నానుతోంది. ముఖ్యంగా ఖిల్లా రోడ్డు వాసుల కష్టాలు వర్ణతీత. బూడిద తట్టుకోలేక స్థానిక ప్రజలు ధర్నా చేస్తే, తూతూ మంత్రంగా అధికారులు చర్యలు చేపట్టారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు రోడ్డు అంతా బురదగా మారి ప్రయాణికుల ఒంటిపై పడుతోంది. భారీ గుంతలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. గతంలో సాధారణ ఎన్నికల కౌంటింగ్ సమయంలో కొంతమెర రోడ్డు వేశారు. కనీసం గుంతలు పూడ్చలేని దౌర్భాగ్య స్థితిలో అధికారులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు.