బొల్లాపల్లిలో ‘ఇది మంచి ప్రభుత్వం’

బొల్లాపల్లి, మహానాడు: బొల్లాపల్లిలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటింటికి తిరిగి 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ, సంక్షేమానందిస్తూ ‘ఇది మంచి ప్రభుత్వం’ అని ప్రజల చేత పిలిపించుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు, జనసేన పార్టీ సమన్వయకర్త నాగ శ్రీను రాయల్‌, నాయకులు నిస్శంకర శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.