20వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా

– చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేస్తా
– రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ
– గండేపల్లి మండలం వైస్ ఎంపీపీ సీనియర్ వైసీపీ నేత కుంచే రాజా ఆధ్వర్యంలో 684 మంది టిడిపిలో చేరిక

కాకినాడ జిల్లా గండేపల్లి ఫిబ్రవరి 18: గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన గండేపల్లి మండల వైస్ ఎంపీపీ వైసీపీ సీనియర్ నేత కుంచె రాజా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తన అనుచర గణం 684 మంది తో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా సూరంపాలెం చేరుకున్న జ్యోతుల నెహ్రూ మండల తెలుగు యువత అధ్యక్షులు కుంచే రామకృష్ణ ఇంటి వద్దకు చేరుకున్నారు.

అక్కడ నెహ్రూకు కుంచె రాజా ఆధ్వర్యంలో వందలాదిమంది ఘన స్వాగతం పలికి ఊరేగింపుగా సభాస్తలికి చేరుకున్నారు. అక్కడ పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. అనంతరం గజమాలతో జ్యోతుల నెహ్రూ ను ఘనంగా సత్కరించిన టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ నాటిన మొక్క నేనని ఆయన విలువలతో రాజకీయాలు చేస్తున్నానని అన్నారు.

కుప్పంలో చంద్రబాబు నాయుడుకి వచ్చే మెజార్టీ తర్వాత జ్యోతుల నెహ్రూ కి అంత మెజార్టీతో మనం గెలిపించుకోవాలని దానికి మన గ్రామం అంతా సిద్ధంగా ఉండాలని కోరారు. నెహ్రూ మాట్లాడుతూ ఇప్పటివరకు టిడిపిలో నాకు అండగా ఉండి పని చేస్తున్న పాత క్యాడర్ తో పాటు ఇప్పుడు వచ్చే రాజా అనుచరులు కలిసి పనిచేసే పార్టీ పటిష్టత పూర్తి చేయాలని ఎవరికి ఇచ్చే ప్రయారిటీ వారికి ఇస్తానని అన్నారు. చరిత్రలో నిలిచిపోయే పనులు ఈ నియోజకవర్గానికి అందించి నేను చరిత్రకారుడుగా మిగిలిపోవాలనే ఆశతో పనిచేస్తున్నాను అని అన్నారు.

ఈ నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చానని, రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతంగా సాగునీరు త్రాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని అన్నారు. నియోజవర్గంలో ఒక విశ్వవిద్యాలయంతో భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తానని ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన వైద్యం అందిస్తానని భారీ పరిశ్రమలు తీసుకొచ్చి నియోజకవర్గంలోని యువతకు 20వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.