టీడీపీ పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి, పెమ్మసాని రత్నశ్రీ
గుంటూరు, మహానాడు: మహిళలపై అరాచకాలు ఆగాలంటే వైసీపీని సాగనంపాలని గుంటూరు పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి, పెమ్మసాని రత్నశ్రీ పిలుపునిచ్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మహిళా విభాగం ఆత్మీయ సమావేశం శనివారం పార్టీ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో వారు పాల్గొన్నారు.
గల్లా మాధవి మాట్లాడుతూ ఐదేళ్లుగా మహిళలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు,కేసులతో తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారన్నారు. వైసీపీ అక్రమాలను కట్టడి చేసి టీడీపీ గెలుపుకు కృషి చేయాలని పిలుపు ఇచ్చారు. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని గుర్తు చేశారు. గుంటూరు నగరం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోందన్నారు.
పెమ్మసాని రత్నశ్రీ మాట్లాడుతూ నగరంలో గంజాయి వాడకం ఎక్కువగా స్లమ్ ఏరియాలలో నుంచి ఇంటింటికి పాకి పోయి యువత భవిష్యత్ నిర్వీర్యమైందన్నారు. వైసీపీ నేతలు ప్రజలను బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి బెదిరింపులకు గురి చేసి ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూడటం సిగ్గుచేటన్నారు. సంక్షేమ పథకాలు నిట్టనిలువునా ఆపివేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు గురించి తెలుసు కోవడానికి గత కొన్నిరోజులుగా నగరంలో తిరుగుతున్నానని చెప్పారు. చిన్న వయసులో వితంతువులుగా మారిన మహిళలు ఎక్కువగా ఉన్నారని, మద్యపానం అనేది ప్రధాన సమస్యగా కనపడుతుందన్నారు. సంక్షేమం అభివృద్ధి అనేవి సమతూకంగా లేకుంటే కుటుంబమే చిన్నాభిన్నం అవుతుందన్నారు. కూటమి వచ్చాక అభివృద్ధి కోసం కృషిచేస్తామని తెలిపారు. సమావేశంలో మహిళా నాయకులు పాల్గొన్నారు.