కౌంటింగ్‌ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే…

-ఎటువంటి విజయోత్సవాలకు అనుమతి లేదు
-రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా

మచిలీపట్నం: కౌంటింగ్‌ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా హెచ్చరించారు. మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో గురువారం ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌లను ఆయన పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఎన్నిక ల అధికారి బాలాజీ, ఇతర అధికారులకు కొన్ని సూచనలు చేశారు. కౌంటింగ్‌ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని, ఎటువంటి విజయోత్స వాలకు అవకాశం లేదన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌పై వైసీపీ ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపామని దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆయన వెంట జిల్లా అధికారులు ఉన్నారు.