ప్రజలు ఓటుహక్కుతో మోదీకి బుద్ధిచెప్పాలి
ఆయన మహానటుడు…ఎన్టీఆర్,ఏఎన్నార్ కూడా సరిపోరు
తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్
తిరుపతి, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ బుధవారం తిరుపతి నగరంలోని గాలి వీధి, నెహ్రు నగర్, దాసరి మఠం, యాదవ్ వీధి, గాంధీపురం, సత్యనారాయణపురం ఉప్పొంగి దళితవాడ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు రద్దవుతాయన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలపై వారు అప్రమ త్తంగా ఉండాలి. ప్రజలు తమ ఓటుహక్కుతో బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ అరెస్టుతో బీజేపీ పతనం ప్రారంభమైంది. ఆ పార్టీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమం కాబోతోంద న్నారు. యాక్షన్‌లో మోదీ ఘనుడు.
అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు కూడా ఆయన కు సరిపోరన్నారు. మేకప్ లేనిదే మోదీ బయటకు రాడు… ఆయన మేకప్ ఖర్చు దినానికి రూ.20 వేలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీ మోదీ, అమిత్ షా జేబులోకి వెళ్లిపోయాయి. రాష్ట్ర ప్రజలు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విజ్ఞతతో ఓటేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం. రైతులు పండిరచే పంటలకు మద్దతు ధర కోసం చట్టం చేస్తాం. ప్రతి నిరుపేద మహిళలకు ఉచితంగా సంవత్సరానికి లక్ష రూపాయలు, ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్థులకు 30 వేలు, పీజీ విద్యార్థులకు 40 వేలు స్కాలర్‌షిప్, ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు గోపి గౌడ్, శాంతి యాదవ్, తేజోవతి, ముని శోభ, వెంకటేష్ గౌడ్, కడియాల భానుప్రకాష్, షేక్ జావేద్, భాస్కర్, చంద్ర, తదితరులు పాల్గొన్నారు.