జగన్‌ తీరు మారకుంటే.. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటూ రాదు

– పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌

అమ‌రావ‌తి, మహానాడు: సాక్షి ప‌త్రిక‌లో ఏం రాస్తున్నారో కూడా జ‌గ‌న్ కు తెలియ‌డం లేదు. ప్ర‌భుత్వం మొత్తం 601 కోట్లు ఖ‌ర్చు చేస్తే 534 కోట్లు ఎలా దుర్వినియోగం జ‌రుగుతుంది…? ఏదో ఒక‌సారి వ‌చ్చి చూసి వెళ్లిన జ‌గ‌న్ కు వాస్త‌వాలు ఎలా తెలుస్తాయి. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి నీళ్ల‌లో తిరిగారు.. మునిగిన ఇళ్ల‌కు వెళ్లారు..స్వ‌యంగా ప‌రిక‌రాలు డ్యామేజిని ప‌రిశీలించారని పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. చంద్ర‌బాబు ప్ర‌తి చిన్న విష‌యాన్ని ప‌రిశీలించి సాయం చేసారు. సాక్షి ప‌త్రిక ఉంద‌ని కోట్లు కొట్టేసార‌ని నోటికొచ్చిన‌ట్లు రాసారు.

ఎన్టీఆర్ జిల్లాలో 139.44 కోట్లు జిల్లా నిధుల నుంచి ఖ‌ర్చు పెట్టారు. విశాఖ హుద్ హుద్ తుపానుకు విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల‌కు చాలా తేడా ఉందని నారాయణ తెలిపారు. విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల్లో కొన్ని చోట్ల నాలుగు రోజులు జ‌నం నీటిలోనే ఉండాల్సి వ‌చ్చింది. 30 ల‌క్ష‌ల వాట‌ర్ ప్యాకెట్లు స‌ర‌ఫ‌రా చేసాం. ప్ర‌జ‌ల‌కు నీరు లేక‌పోవ‌డంతో మేం స‌ర‌ఫ‌రా చేసిన వాట‌ర్ బాటిల్స్ ను టాయిలెట్స్ కు కూడా ఉప‌యోగించుకున్నారు. మొత్తం ఖ‌ర్చు 93.5 కోట్లు అయింది.

బాధితుల‌కు అవ‌స‌ర‌మైన భోజ‌నాన్ని అప్ప‌టిక‌ప్పుడు ఇత‌ర జిల్లాల నుంచి తెప్పించాం. పేప‌ర్ ఉంది క‌దా అని నోటికొచ్చిన‌ట్లు రాస్తే జ‌నం న‌మ్మే ప‌రిస్థితిలో లేదు. విజ‌య‌వాడ వ‌ర‌ద‌ల్లో చంద్ర‌బాబు చేసిన సాయాన్ని ప్ర‌జ‌లంతా మెచ్చుకుంటున్నారు. వ‌ర‌ద‌ల్లో ప‌దివేల మంది మున్సిప‌ల్ సిబ్బంది రాత్రీప‌గ‌లు ప‌నిచేసారు. ఇత‌ర జిల్లాల నుంచి ఫైర్ ఇంజిన్లు తెప్పించి ఇళ్ల‌ను శుభ్రం చేయించాం. ఇళ్లు నీట మునిగిన వారికి మా ప్ర‌భుత్వం 25 వేలు ఇస్తే జ‌గ‌న్ రెండు వేలు, నాలుగు వేలు ఇచ్చారని నారాయణ విమర్శించారు. వ‌ర‌ద బాధితుల‌కు 4 ల‌క్ష‌ల 6 వేల కుటుంబాల‌కు 601 కోట్లు ప‌రిహారం అందించాం. విజ‌య‌వాడ లో నాలుగు వార్డుల్లో 15 రోజుల పాటు వ‌ర‌ద ఉంది. జ‌గ‌న్ ఇలానే చేస్తే రాబోయే రోజుల్లో ఒక్క సీటు కూడా రాదు. జ‌గ‌న్ కు చివ‌ర‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో కూడా సున్న మిగులుతుంది.

కార్యకర్తలకు సపోర్ట్ చేస్తే తప్పా? సాక్షి పత్రిక, వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. గత 5 సంవత్సరాల్లో వ్యాపారం చేసుకోవాలి అంటే భయపడేవారు. నిన్న టెలికాన్ఫరెన్స్ లో నేను చెప్పింది ఒకటైతే దాన్ని సెన్సార్ చేసి చూపించారు.
కష్టపడిన కార్యకర్తలకు సంవత్సరానికి 10 కోట్లు చొప్పున 50 కోట్లు ఇస్తాను అని చెప్పాను. ఇప్పటి కే 2 కోట్లు ఇచ్చాను… గత ప్రభుత్వం లో ఏ వ్యాపారం చేయాలన్న 10 నుండి 20 శాతం షేర్ ఇవ్వాలి. అందరూ వ్యాపారం చేయాలి అనేది మా ఉద్దేశం…గత వైసీపీ తరహా దందా మేం చేయం. ఎవ్వరైనా వ్యాపారం చేయడానికి స్వేచ్ఛ వుంటుంది. ఎవ్వరు వ్యాపారం చేసినా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇప్పుడు నెల్లూరు సిటీ లో అందరూ ఆనందంగా వున్నారు. 250 కుటుంబాలకు ఆదాయం వచ్చే నిర్ణయాన్ని అడ్డుకొని నెల్లూరు లో హోటల్ కట్టకుండా అడ్డుకున్నారని దుమ్మెత్తిపోశారు. మేము వచ్చాక గంట లో అనుమతులు ఇచ్చాం… దీనీ వల్ల ఆదాయం పెరుగుతుంది, ఉపాధి కలుగుతుంది. నెల్లూరు లో నారాయణ ఇలా చేసుకుంటూ పోతే వైసీపీ జీరో అయిపోతుందనే భయం వైసీపీ నాయకుల్లో పెరిగిందన్నారు.