– రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి
హైదారాబాద్: నా ఇల్లు ఇల్లీగల్ గా ఉంటే కూల్చివేయాలి. నాకు టైమ్ ఇస్తే ఇంట్లో సామాన్ తీసుకుని బయటకి వెళ్తా. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసు ఇచ్చారు. ఇప్పటివరకు ఏ అధికారి కలవలేదు. నేను 2016-17 లో అమర్ సొసైటీలో ఒక నివాసాన్ని కొనుగోలు చేశాను. కొనుగోలు చేసినప్పుడు ఈ బిల్డింగ్ FTL లో ఉంది అన్న సమాచారం నా దగ్గర లేదు.నా ఇల్లు బఫర్ జోన్ లో ఉందని, వాల్టా యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చారు. 1995 లోనే ఈ లే ఔట్ కి పర్మిషన్ వచ్చింది.బీఆరెస్ వాళ్ళు నా ఇంటిని పట్టుకొని రాజకీయం చేస్తున్నారు.గత పదేళ్ళలో ఎన్నో అక్రమాలు చేశారు.