– ఎమ్మెల్యే డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
దర్శి, మహానాడు: తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డకు ఆరోగ్యం చేకూరుతుందని, ఈ దృష్ట్యా తల్లులు పౌష్టికాహారాన్ని తీసుకొని పిల్లలకు తల్లిపాలతో వారి ఆరోగ్యాన్ని పరిరక్షించాలని తెలుగుదేశం పార్టీ దర్శి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు. ఈ మేరకు ఆమె మంగళవారం కురిచేడు దొనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరిగిన తల్లి పాల వారోత్సవంలో పాల్గొని మాట్లాడారు. తల్లులు గర్భిణీ సమయంలో ఆ తరువాత పౌష్టికాహారాన్ని తీసుకొని పిల్లలకు తల్లిపాలన ఇవ్వాలని తద్వారా వారు దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అంతేకాక తల్లులు ఎక్కువగా వాటర్ తీసుకోవాలని సూచించారు.
ఆరోగ్యమైన సమాజం కోసం పౌష్టికాహారాన్ని తీసుకోవడం ముఖ్యమని ఒక డాక్టర్ గా… ఒక తల్లిగా… చెబుతున్నానని ఎమ్మెల్యే అన్నారు. సమాజం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజల కోసం నిరంతరం పాటు పడే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాహిత కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో కురిచేడు, దొనకొండ మండలం టిడిపి అధ్యక్షులు పిడతల నేమిలయ్య, నాగులపాటి శివకోటేశ్వర రావు, వివిద హోదాల్లో ఉన్న నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.