పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల కమిషన్ చేసింది తప్పే
దేశమంతా ఒక రూల్..రాష్ట్రంలో ఇంకో రూలా?
వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు కొత్త కాదు
కౌంటింగ్‌లో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి
జనం మాతో ఉన్నారు..అధికారంలోకి వస్తాం
10.30 గంటలకు సంబరాలకు సిద్ధం కండి
వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి: కొన్ని గంటల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు అంతా అప్రమత్తంగా ఉండాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. 10:30 గంటలకు సంబరాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోస్టల్ బ్యాలె ట్‌పై తమ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేస్తే తప్పు తప్పు కాకుండా పోతుందా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ తన నిర్ణయాలను తామే ఉల్లంఘిస్తారా అని ప్రశ్నించారుప. దేశం అంతా ఒక రూల్..రాష్ట్రంలో మరో రూల్ ఏమిటి? పొలింగ్ అయ్యాక పోస్టల్ బ్యాలెట్‌పై కొత్త నిబంధనలు తీసుకురావడం ఏమిటి? ఎన్నికల కమిషన్‌ను చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు కొత్త ఏమి కాదు. ఈసీ కోడ్ వచ్చి పొత్తులు పెట్టుకున్న నాటి నుంచి అడ్డగోలుగా నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు ఫాలో అవ్వకుండా ఎలాగోలా విజయం సాధిస్తామనే భ్రమలో ఉన్నారు. వైసీపీ బలమైన పార్టీ రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు.
ప్రతిపక్షంలో ఉన్నపుడు ఎలా ఉన్నామో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బాధ్యతాయుతంగా ఉన్నాం. సీఈఓను బెదిరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. హడావిడి చేసి పబ్లిసిటీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఫుల్ పిక్చర్ అర్థం అయింది. 21 సీట్లలో పోటీ చేసిన జనసేన పార్టీకి 7 శాతం ఓటింగ్ శాతం ఎలా వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ చూసి జనం నవ్వుతున్నారు. పొంతన లేని ఎగ్జిట్ పోల్స్ చూసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మేము జనంతో ఉన్నాం జనం మాతో ఉన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తాం. ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టు గురించి ఎక్కడైనా చర్చ జరిగిందా. చంద్రబాబు అరెస్టు అయి తే ఒక్క పిల్లాడు కూడా బయటకు రాలేదు. ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ గురించి లేని పోని అసత్యాలు ప్రచారం చేసినా నమ్మలేదని వ్యాఖ్యానించారు.