Mahanaadu-Logo-PNG-Large

అన్న ఎన్టీఆర్‌ను టచ్‌ చేస్తే తీవ్ర పరిణామాలు

గుంటూరులో స్టేడియం పేరు మార్పు శిలాఫలకాల కూల్చివేత
ఎన్టీఆర్‌ జిమ్‌గా నామకరణం చేసిన బ్రాహ్మణ చైతన్య వేదిక
పాల్గొన్న వాకింగ్‌ ట్రాక్‌ సభ్యులు, ఎన్టీఆర్‌ అభిమానులు

అమరావతి: ఎవరైనా అన్న ఎన్టీఆర్‌ను టచ్‌ చేయాలని చూస్తే తీవ్ర పరిణా మాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌శర్మ హెచ్చరించారు. నగరం నడిబొడ్డున బృందా వన్‌ గార్డెన్స్‌లో ఎన్టీఆర్‌ స్టేడియం పేరు మార్చాలని వైసీపీ సైకోలు చేసిన కుట్రను ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక న్యాయ పోరాటం ద్వారా సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఇందులో భాగంగా శ్రీధర్‌ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ స్టేడియంలో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ మూకలు ఏర్పాటు చేసిన పేరు మార్పు శిలా ఫలకాలను వాకింగ్‌ ట్రాక్‌ సభ్యులు, ఎన్టీఆర్‌ అభిమానులు ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆ నూతన భవనానికి ఎన్టీఆర్‌ జిమ్‌గా నామకర ణం చేసి పెద్ద అక్షరాలతో బిల్డింగ్‌ బయట బోర్డు అమర్చారు.

ఈ సందర్భంగా శ్రీధర్‌శర్మ మాట్లాడుతూ స్టేడియంలో నూతన భవనానికి వైఎస్సార్‌ జిమ్‌, వైఎస్సార్‌ స్టేడియంగా పేరు మార్చేందుకు కుట్ర పన్నడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. దీనిపై బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామని, నిర్మాణం ఆపకుండా మున్సిపల్‌ అధికా రులు, వైసీపీ ప్రజాప్రతినిధులతో కుమ్మక్కై అక్రమ నిర్మాణం చేపట్టారని తెలిపారు. హైకోర్టులో పిల్‌ పెండిరగ్‌లో ఉండగా రాష్ట్ర మాజీ మంత్రి విడుదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, టీడీపీ ఓట్లతో గెలిచిన పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి, మున్సిపల్‌ కమిషనర్‌ కీర్తి చేకూరి తదితరుల పేర్లతో శిలాఫలకాలు ప్రారంభించి ఎన్నికల కోడ్‌ను కూడా ఉల్లం ఘించారని ధ్వజమెత్తారు. వారిపై ఎన్నికల కమిషన్‌ నేటి వరకు చర్యలు తీసుకో లేదని తెలిపారు. జగన్‌ రాక్షస పాలనలో గుంటూరు నగరంలో అరాచకాలకు ఇది ఒక పరాకాష్ట అని పేర్కొన్నారు.

నిధులను కూడా కాజేశారు…

టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఈ స్టేడియాన్ని కౌన్సిల్లో తీర్మానం చేసి ఎన్టీఆర్‌ స్టేడియంగా పేరు పెట్టారని వివరించారు. కార్పొరేషన్‌లో 49 లక్షలు ఈ భవన నిర్మాణానికి కేటాయింపులు చేస్తే మున్సిపల్‌ రికార్డులలో ఎక్కువ నిధులు కేటా యించినట్లుగా చూపబడిరదన్నారు. ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని కాజేసి దుర్వినియోగం చేశారని, తక్షణమే ఆడిట్‌ చేయించి ప్రభుత్వ విచారణ చేసి ఆ డబ్బును మరలా గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌కు తెచ్చే విధంగా నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక అనేది ఒక బ్రాహ్మణ కులం కోసం మాత్రమే పనిచేసేది కాదని, అన్ని సామాజిక వర్గాలు, మత వర్గాలు, ముఖ్యంగా టీడీపీ కోసం, ప్రజా సమస్యలపైన పోరాడుతుందన్నారు. ఎన్టీఆర్‌ పట్ల ఎవరు అవమానకరంగా ప్రవర్తించినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్చక సేవా సంఘం ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, మాజీ యువత అధ్యక్షుడు కొమ్మినేని సాంబశివరావు, సవరం రోహిత్‌, షేక్‌ ఖాదర్‌ బుడే, షేక్‌ జిలాని, షేక్‌ బాజీ, తెలగతోటి సుధీర్‌, జొన్నలగడ్డ ఉదయ భాను, నల్లపనేని అమర్నాథ్‌, కొనకళ్ళ సత్యం, వలివేటి కృష్ణ, బెల్లంకొండ జయచంద్ర, బ్రాహ్మణ సంఘ నాయకులు కొప్పర్తి సీతారమేష్‌, బొడ్డుపల్లి శ్రీనివాస్‌, ఎండపల్లి శబరి, వంగవీ టి చైతన్య, చిలుమూరు ఫణి, నందివెలుగు చందు, వడ్డమాను ప్రసాదు, మరియు కనపర్తి శ్రీనివాసరావు, నూతలపాటి గోపి, తెలుగుయువత నరేష్‌ గుత్తికొండ శ్రీనివాస్‌, ఎన్టీఆర్‌ వాకింగ్‌ ట్రాక్‌ సభ్యులు, ఎన్టీఆర్‌ అభిమానులు వందలాదిగా పాల్గొన్నారు. తొలుత ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలదండలు లేసి పురోహితులు పూజా కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు తప్పెట్లు, తీన్మార్లతో బృందావన్‌ గార్డెన్‌ సెంటర్‌ను మోత పుట్టించారు.