అక్రమ కట్టడాన్ని పిల్లర్ల సహా నేలమట్టం చేయాలి

– లేదంటే ఆందోళన తప్పదు
– సిరిపురపు శ్రీధర్ శర్మ హెచ్చరిక

అమరావతి, మహానాడు: ప్రభుత్వ అధికారులు చాలామంది తాము ఇంకా జగన్ ప్రభుత్వంలోనే పనిచేస్తున్నామని, అరాచకాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు… చంద్రబాబు ప్రభుత్వం అటువంటి అధికారులు తీరు మారేలా కఠిన చర్యలు చేపట్టాలి.. లేనిపక్షంలో ప్రజలకు తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, మేయర్ గుంటూరు నగరంలో బస్సులు తిరగని ప్రాంతాల్లో కూడా 20 చోట్ల బస్సు బే నిర్మాణాలకు భవానీ యాడ్ ఏజెన్సీకి 33 ఏళ్ళపాటు మున్సిపల్ రోడ్లను లీజుల పేరుతో ఎలా అనుమతులు ఇచ్చారని శ్రీధర్‌ నిలదీశారు. కౌన్సిల్ సమావేశాలలో ఈ బస్సు బేల పై తీర్మానాలను రెండుసార్లు సభ్యులు వ్యతిరేకించిన సరే అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బస్ బేల పేరుతో నడిరోడ్డ్లపై షాపులు నిర్మాణాలకి 150 గజాల రోడ్డుని అనుమతులు ఎలా ఇస్తారన్నారు.

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు కూతవేటు దూరంలో, గాంధీ పార్క్ ఎదురుగా నడి రోడ్డుని ఆక్రమించి అర్ధరాత్రి పూట నిర్మిస్తున్న ఈ బస్సు బేస్లాబ్ అక్రమ నిర్మాణం పై శ్రీధర్ ఆందోళన చేయడంతో మున్సిపల్ అధికారులు నిన్న అర్ధరాత్రి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రొక్లయినర్‌ తీసుకొచ్చి నిర్మాణానికి అడ్డుగా కట్టిన పరదాలను, స్లాబ్ నిర్మాణానికి వినియోగించే ఇనుము, సెంట్రింగ్ చెక్కలను, బాదులను తొలగించారు. అలాగే, నగరంలో ఇప్పటివరకు నిర్మించిన నిర్మాణాలను కూల్చివేయకపోతే ఉద్యమం తప్పదన్నారు.

బిల్లింగ్ స్లాబ్ కోసం రోడ్డును ఆక్రమించి నిర్మించిన సిమెంట్ పిల్లర్స్ ని కూడా తక్షణమే నేలమట్టం చేయాలని శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు.