వైసిపి నేతల అక్రమాలు ఈ రకంగా ఉంటాయా ?

-రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశం
-గత ప్రభుత్వ మాదిరిగా కమిషన్లు అడిగే వారు ఎవరు లేరు
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతలు అధికారాన్ని ఉపయోగించి ఇష్టానుసారం వ్యవహరించి, సామాన్యులకు అయితే ఒక న్యాయం, వైసీపీ నేతలకు అయితే న్యాయం అనేటట్లు చేశారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యురాలు గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం 31 డివిజన్ లో ఆమె పర్యటించారు.

తొలుత ఏటి అగ్రహారం మెయిన్ రోడ్డులోని నీళ్ల ట్యాంక్ ని పరిశీలించారు. నీళ్లు ట్యాంక వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అనంతరం డివిజన్లోని నాలుగో లైన్ లో గతంలో రోడ్డు విస్తరణలో అనేక ఇళ్లను పడగొట్టారు. అయితే  విస్తరణ పనులు సవ్యంగా జరగలేదని, కాలువల నిర్మాణం ఎందుకు ఇలా వంకరగా ఉన్నదని అధికారులను ప్రశ్నించారు. ఇందులో వైసీపీ నేతల ఇళ్ళు ఉండటంతోటే ఇలా ఇష్టానుసారం రోడ్డు నిర్మాణాన్ని మార్చారని స్థానిక ప్రజలు ఆరోపించారు.

ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పందిస్తూ… వైసిపి నేతల అక్రమాలకు కాదేదీ అనర్హం అన్నట్లు ఉన్నదని ఎద్దేవా చేశారు. అదేవిధంగా 4వ లైన్ చివర మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి రేకుల షెడ్డును ఏర్పారు చేసారని,దీనిని వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.

అనంతరం ఏటి అగ్రహారం 4వ లైన్ బోరింగ్ పంపు సెంటర్ నుండి జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. రోడ్డు నిర్మాణములో నాణ్యత ప్రమాణాలు పాటించాలని,గత పాలకుల మాదిరిగా కమిషన్లు అడిగే వారు లేరని కాబట్టి పనులలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా ఉండాల్సిందేనని, పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఎమ్మెల్యే కోరారు.