నరసరావుపేట టీడీపీలోకి వలసల జోరు

మరింత జోష్‌లో పార్టీ శ్రేణులు

నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు జోష్‌ మీద కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు టీడీపీ అభ్యర్థులుగా నరసరావుపేటకు చదలవాడ అరవింద బాబును ప్రకటించడంతో వారు ఎన్నికల ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. అదే సమయంలో నియోజక వర్గంలో పలు ప్రాంతాలు,వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు పెద్దసంఖ్యలో వైసీపీని వీడి టీడీపీలోకి వస్తున్నారు. నిత్యం భారీ చేరికలు ఉంటుండటంతో శ్రేణులు మరింత జోష్‌ నెలకొనగా వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. గత పది రోజులుగా నియోజకవర్గంలో ప్రతి రోజూ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. నరసరావుపేటలో ఆదివారం రాత్రి భారీగా టీడీపీలో చేరారు.

పట్టణ శివారు ప్రాంతమైన ఎస్‌ఆర్‌.కే.టి కాలనీ నుంచి 30 కుటుంబాలు, వరవకట్ట నుంచి 25 కుటుంబాలు వెంగల్‌ రెడ్డి కాలని, ఇస్లాంపేట నుండి టీడీపీ యువత నాయకులు శాఖమూరి మారుతి,షేక్‌ నాగూర్‌,షేక్‌ రఫీ ఆధ్వర్యంలో రాజా, జ్ఞానోజీ, నాగమల్లేశ్వరరావు, నవీన్‌, విజయలక్ష్మి, రాగిణి 100 మంది కళాకారులు అరవింద బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముందు చిత్రాలయా సెంటర్‌ కోటప్పకొండ రోడ్‌ వరకు భారీ ర్యాలీ జరిగింది. కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.