హైదరాబాద్ లో రూ. 5 కే టిఫిన్

హైదరాబాద్ :  గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం 320 కి పైగా అన్నపూర్ణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. రోజూ మధ్యాహ్నం రూ. 5 కే భోజనం అందిస్తున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం టిఫిన్ అందుబాటు లోకి తీసుకు వచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తోడుగా మరో 50 కేంద్రాలను జీహెచ్ఎంసీ పరిధిలో అందుబాటు లోకి తేవాలని అధికారులు నిర్ణయించారు..