ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం!

ఢిల్లీ: ఢిల్లీలో మళ్ళీ వాయు కాలుష్యం పెరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో వెరీ పూర్ క్యాటగిరిలో గాలి నాణ్యత కనిపిస్తోంది. ఢిల్లీ ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటి ఇండెక్స్ పై 334 పాయింట్లుగా ఉన్న గాలి నాణ్యత. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై సగటున 273 పాయింట్లుగా గాలి నాణ్యత ఉంది. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్ధాల దహనం తో ఢిల్లీని కమేస్తున్న పొగ , కాలుష్యం రోజు రోజుకూ పెరుగుతోంది. చలి తీవ్రత పెరగడం, వాయు వేగం తగ్గడంతో ఢిల్లీ ఎన్సీఆర్ లో గాలి నాణ్యత తగ్గిపోయింది. ఢిల్లీ వాసులు కళ్ళ మంటలు, గొంతు నొప్పి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.