వినుకొండలో ఇండియన్ ఆర్మీ ర్యాలీ

– ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ

వినుకొండ, మహానాడు: టెరిటోరియల్ ఆర్మీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో సైనిక సిబ్బంది దేశవ్యాప్త సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాశ్మీర్ లోని సియాచిన్ బేస్ నుంచి మొదలైన ఆర్మీ సైకిల్ యాత్ర ఆదివారం వినుకొండకు చేరుకుంది. సోమవారం ఉదయం వెన్నెల మార్కెట్ వద్ద నుండి మొదలైన ఆర్మీ ర్యాలీని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వారి సతీమణి శివశక్తి లీల అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి ప్రారంభించారు. సైనిక సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే సైకిల్ ర్యాలీలో పాల్గొని లయోలా హైస్కూల్ వద్దకు చేరుకున్నారు. కార్యక్రమంలో మాజీ శాసనసభ్యుడు మక్కెన మల్లికార్జున రావు, జనసేన పార్టీ సమన్వయకర్త కొనిజేటి నాగశ్రీను రాయల్‌ పాల్గొన్నారు.