– పెమ్మసాని ఫౌండేషన్ అధినేత పెమ్మసాని రవి
విజయవాడ, మహానాడు: భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికే ఆదర్శనీయమని పెమ్మసాని ఫౌండషన్ అధినేత, టీడీపీ యువనాయకుడు పెమ్మసాని రవి అన్నారు. శ్రీనివాసరావుతోటలో జరుగుతున్న వినాయచవితి మహోత్సవాల్లో అయన సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగాఉత్సవ కమిటీ, పొన్నూరుకి చెందిన అయోధ్య సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోలాట నృత్యాలను, భరత నాట్యం ప్రదర్శనను తిలకించారు.
ఈ సందర్బంగా పెమ్మసాని రవి మాట్లాడుతూ ప్రతీ ఏటా వినాయకచవితి వేడుకలు ఘనంగా జరుగుతుండటం ఎంతో ముదావాహం అన్నారు. ప్రజల్లో, ప్రధానంగా యువతలో భక్తిభావం పెరగటం ద్వారా మరింత ఆరోగ్యకరమైన సమాజాన్ని సాధించుకోవచ్చన్నారు. అనంతరం టీచర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అద్భుతంగా కోలాటం వేసిన చిన్నారులను పెమ్మసాని రవి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, ఐరా ఫౌండేషన్ కసుకుర్తి అరుణ, రావిపాటి సాయి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.