-400 స్థానాలతో మూడోసారి మోదీదే అధికారం
-రాష్ట్రంలోనూ తెలంగాణ పొలిటికల్ లీగ్ మొదలైంది
-కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో టీం దూసుకుపోతోంది
-కాంగ్రెస్‌కు ప్లేయర్స్ కూడా దొరకడం లేదు
-బీఆర్‌ఎస్ టీం సభ్యులు నిరాశలో ఉన్నారు
-17 సీట్లను గెలిచి టీపీఎల్ కప్‌ను గెలవబోతున్నం
-కాంగ్రెస్‌పై తీవ్రమైన ప్రజావ్యతిరేకత మొదలైంది
-ధాన్యం కొనుగోళ్లు లేక రైతులకు కష్టాలు
-తాలు, తేమ, తరుగుతో పనిలేకుండా వడ్లు కొనే దిక్కే లేదు
-కనీస ధర, రూ.500 బోనస్ కోసం ఎదురు చూస్తున్నారు
-కాంగ్రెస్ లైసెన్స్‌ను రద్దు చేసేందుకు జనం సిద్ధమయ్యారు
-కరీంనగర్ కోనం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేసిందేమిటి?
-నన్ను ఓడిరచేందుకు కుట్రలు చేస్తున్నారు
-గుంటనక్క పార్టీలు ఏకమైనా గెలిచి దమ్ము చూపిస్తాం
-కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగిన బండి సంజయ్
కరీంనగర్, మహానాడు: ‘‘ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నడుస్తోంది. ఒకవైపు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ టీం బరిలో దిగింది. మరోవైపు ఐఎన్డీఏ కూటమి పేరుతో గుంట నక్కల పార్టీలన్నీ టీంగా బరిలో ఉన్నయ్… ఆ కూటమి టీంను చిత్తుగా ఓడిరచి 400 స్థానాలతో కేంద్రంలో మోదీ ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దేశంలో మాదిరిగానే రాష్ట్రంలో కూడా తెలంగాణ పొలిటికల్ లీగ్ (టీపీఎల్) ఆట మొదలైందని వ్యాఖ్యానించారు. కి
షన్‌రెడ్డి ఆధ్వర్యంలో నాతో సహా 17 మంది సభ్యుల టీం బరిలోకి దిగినం. అటువైపు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ గుంట నక్కల టీంలు బరిలో దిగినయ్. వేర్వేరుగా బీజేపీని ఓడిరచడం సాధ్యం కాదని.. చీకటి ఒప్పందాలతో ఆ రెండు ఒక్కటైనయ్… అయినప్పటికీ వాటిని ఓడిరచి టీపీఎల్ కప్‌ను గెలవబోతున్నాం.. మోదీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ రాజశ్రీ గార్డెన్‌లో శనివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ స్థాయి నాయకులతో ‘బూత్ విజయ సంకల్ప్ అభియాన్’ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బండి సంజయ్‌తో పాటు ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాం గ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ ఎన్నికలను క్రికెట్‌తో పోలుస్తూ తనదైన శైలిలో ప్రసంగించారు. రైతులను మోసం చేస్తే మిల్లర్లు, వ్యాపారుల లైసెన్స్ రద్దు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం…వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ లైసెన్స్‌ను కూడా ప్రజలు రద్దు చేయబోతున్నారని విమర్శించారు. ఇంత పెద్దఎత్తున హాజ ంౖన కార్యకర్తలను చూస్తే జోష్ వస్తోంది. నన్ను ఓడిరచడానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయి. అందులో భాగంగానే తనపై దుష్ప్రచారం చేస్తున్నా రు.. వాళ్లెన్ని కుట్రలు చేసినా జనం పట్టించుకోరు.. గుంట నక్కల పార్టీలన్నీ ఒక్కటై కూటమిగా బరిలో దిగినా అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నామన్నారు.
రైతులను దగా చేసిన కాంగ్రెస్
రాష్ట్రంలో అతి తక్కువ వ్యవధిలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న ఏకైక పార్టీ కాం గ్రెస్ అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేశారు.. ప్రజలు కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు… రైతులు వడ్ల కొనుగో లు కేంద్రాల్లో రాశులు పోసినా కొనే నాధుడు లేక అల్లాడుతున్నారు. తాలు, తరుగు, తేమ పేరుతో దోచుకునేందుకు దళారులు సిద్ధమైనా సర్కార్ పట్టించు కోవడం లేదు.. వడ్లకు కనీస మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ మొండి చేయి చూపుతోంది. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లు కొంటామని మోసం చేశారు… రూ.3 లక్షల వడ్డీలేని రుణం ఇస్తామని దగా చేసింది. రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోవడంతో రైతులను బ్యాంకర్లు డిఫాల్టర్లుగా ప్రకటిం చాయి… రైతులకు అప్పులు కూడా పుట్టడం లేదు… రైతులు బతికేదెలా? అం దుకే రైతులంతా కాంగ్రెస్‌పై కసితో ఉన్నారని పేర్కొన్నారు.
ఆ హామీలు ఏమయ్యాయి?
మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు నెల నెలా రూ.2,500లు ఇస్తామని హామీ ఇచ్చారు.. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్నారు. ఇల్లులేని వాళ్లందరికీ జాగాతో పాటు రూ.5 లక్షల నగదు సాయం చేస్తామన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. రైతులకు ఎకరాకు రూ.15 వేల భరోసా సాయం అన్నారు… ఎక్కడైనా ఇచ్చారా? మోసగించిన కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలే? అని ప్రశ్నించారు.
కరీంనగర్ అభివృద్ధికి రూ.12 వేల కోట్లు తెస్తే…
కరీంనగర్ నుంచి వరంగల్, ఎల్కతుర్తి నుండి సిద్దిపేట రోడ్ల విస్తరణ సహా కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం రూ.12 వేల కోట్లకు పైగా తీసుకొస్తే… మేమే చేశామని బీఆర్‌ఎస్ ప్రచారం చేసుకుంటున్నాయంటే.. వాళ్లు ఎంతటి అబద్ధాల కోరులో అర్థం చేసుకోండి… నేను ఎంపీగా ఉన్నప్పుడే నిధులు తీసుకొ చ్చి ప్రధానితో జాతీయ రహదారుల విస్తరణ పనులు ప్రారంభిస్తే… మా వల్లే అంటూ బీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రచారం చేసుకుంటున్నాడంటే…ఏమనాలే? కరీం నగర్ ఆర్వోబీ నిర్మాణానికి నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిధులియ్యకుంటే… కొత్తగా వచ్చి సేత బంధన్ స్కీం నుంచి కేంద్రం నుంచి మొత్తం నిధులు తీసుకొచ్చి ఆర్వోబీ పనులు చేపడుతుంటే… సిగ్గు లేకుండా బీఆర్‌ఎస్ నేతలు కొబ్బరికాయ కొట్టుకున్నారు… తెలంగాణ మొత్తానికి సీఆర్‌ఐఎఫ్ నిధులు ఎన్ని వచ్చాయో… అందులో సగానికిపైగా నిధులు కరీంనగర్‌కే తీసుకొచ్చిన ఘనత మాదే… స్మార్ట్ సిటీ నిధులను కేసీఆర్ ప్రభుత్వం దారి మళ్లిస్తే… నేను నిలదీసి లేఖలు రాసి మళ్లీ ఆ నిధులను జమ చేయించా.. మరి అపర మేధావి ఎందుకు కేసీఆర్‌ను ప్రశ్నిం చలే అని హితవుపలికారు.
ఇక్కడున్న మంత్రి అడ్డగోలుగా మాట్లాడుతుండు
నేను ఇవన్నీ మాట్లాడుతుంటే… ఇక్కడున్న మంత్రి (పొన్నం ప్రభాకర్) అడ్డగో లుగా మాట్లాడుతున్నాడు.. బండి సంజయ్ ఏం చేసిండు. శ్వేత పత్రం ప్రకటిం చాలని అంటున్నాడు… నేను చేసిన అభివృద్ధిపై బుకలెట్ ముద్రించి ఇంటింటికీ పంపించినా మాట్లాడుతున్నడంటే ఏమనాలే… ఇయాళ కేసీఆర్ ప్రభుత్వం ఓడి పోయిందంటే… అది బీజేపీ చేసిన పోరాటాల ఘనతే. నా గుండెలో స్టంట్ ఉన్నా రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళల పక్షాన ఉద్యమాలు చేశా. 1600 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉన్నా. నేను నిరుద్యోగులు, ఉద్యోగుల పక్షాన కొట్లాడితే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినా ఏనాడూ భయపడలే అని అన్నారు.
ఐదేళ్లు బీఆర్‌ఎస్‌పై కొట్లాడినా..కాంగ్రెస్ ఏం చేసింది?
నేనడుగుతున్నా కాంగ్రెస్ నేతలు గత ఐదేళ్లలో ఎన్నడైనా పోరాటాలు చేశారా? నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగుల పక్షాన ఏనాడైనా ఉద్యమాలు చేశారా? దళిత బంధు, దళిత సీఎం హామీ కోసం కొట్లాడిరది బీజేపీ. పోడు భూములకు పట్టాల కోసం యుద్ధం చేశాం. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేష న్లు అమలు చేయకపోతే ప్రగతిభవన్‌పై దాడి చేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చి అమలయ్యేలా చేశాం. మరి కరీంనగర్‌లోని ఇద్దరు మాజీ ఎంపీలు ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలే అని ప్రశ్నించారు.
హిందూ సమాజం బుద్ధి చెప్పాలి
ఇక బీజేపీ విషయానికొస్తే… 370 ఆర్టికల్‌ను రద్దు చేసి కాశ్మీర్‌కు స్వతంత్య్రం కల్పించింది. ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేసిందిీ. రామ మందిరాన్ని నిర్మించింది. హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేష న్‌ను ప్రకటించినప్పుడే.. వాళ్ల కుట్రలు ఏందో ప్రజలు అర్థం చేసుకోవాలి. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీ ప్రభుత్వమే… అలాంటప్పుడు కరీం నగర్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఓట్లేస్తే మురిగిపోయినట్లే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది …చేసింది బీజేపీయే… కరీంనగర్ పార్లమెంట్‌ను అభివృద్ధి చేసే బాధ్యత నాది… కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు రక్షణగా నేనుంటా… మీరు కరీంనగర్ ఎంపీగా గెలిపిస్తే మోదీకి నా ఓటేసి ప్రధానిగా మళ్లీ చేసుకుందాం అని పిలుపునిచ్చారు.