ఏడు విడతల పోలింగ్ ప్రశాంతం
కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌కుమార్
ఢిల్లీ: పోలింగ్ ముగిసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌కుమార్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఏడు విడతలుగా పోలింగ్ విజయవంతంగా జరిగిందని, ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డ్ అని పేర్కొన్నారు. మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య జీ7 దేశాల జనాభాకు 1.5 రెట్లు, యూరోపియన్ యూనియన్ జనాభాకు 2.5 రెట్లు ఎక్కువని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటేసినట్లు తెలిపారు. అతి పెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. 85 ఏళ్ల పైబడిన ఓటర్లు ఇంటి వద్దే ఓటు వేశారు. యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ దేశాల జనాభా కంటే మన ఓటర్ల సంఖ్య ఎక్కువని వివరించారు.