కేంద్ర నిధులతోనే ఇందిరమ్మ ఇళ్లు

– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ

తెలంగాణ లో రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం వెచ్చించే సొమ్ము లో సింహ భాగం కేంద్ర సహకారం తో వచ్చే నిధులే. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా కేంద్ర నిధులు మరియు హడ్కో ద్వారా కేంద్ర సహకారంతో వచ్చే రుణం తోనే రాష్ట్రం లో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.

భారత దేశంలోని ప్రతి పేద కుటుంబా నికి సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతోనే, 9 ఏండ్ల క్రితం ప్రధాని మోడీ ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం ప్రారంభించారు. 9 ఏండ్ల లో మోడీ దేశ వ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు కట్టించి పేదల కల నెరవేర్చారు. తెలంగాణలో కూడా అందరికీ సొంత ఇండ్లు ఉండాలనే ఉద్దేశంతో మొదటి సంవత్సరమే 2,50000 ఇండ్లకు 5894 కోట్ల రూపాయలు కేటాయిస్తే అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్షంతో ఆ పథకం పూర్తి స్థాయిలో అమలు కాకుండా పోయింది.

కేంద్రం లో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందన్న నమ్మకంతో మొన్నటి శాసనసభ ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం పంచిన 70,000 ఇండ్లకు గాను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం లో చేర్చేందుకు లిస్ట్ పంపింది. ఆ ఇండ్లకు దాదాపు గా 600 కోట్లు కేంద్రం జమచేయనుంది.

మార్చ్ 5 , 2024 న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన GO ప్రకారం రాష్ట్రంలో మొత్తం కట్టబోయే 95,235 ఇండ్లకు గాను హడ్కో రుణం 3000 కోట్లు తీసుకోబోతున్నట్లు గా చెప్పారు. అంటే ఒక్కో ఇంటికి దాదాపు 3 లక్షల రుణం హడ్కో ద్వారా లభిస్తుంది.

ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం ద్వారా అర్బన్ ప్రాంతంలో నీ ప్రతి ఇంటికి 1,50,000 మరియు గ్రామీణ ప్రాంతం లోని ప్రతి ఇంటికి 72000 కేంద్రం డైరెక్ట్ గా చెల్లిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఖర్చు పెట్టనున్నట్టుగా చెపుతున్న 5 లక్షల రూపాయల లో 4,50,000 కేంద్ర సహకారం వల్ల లభిస్తున్న డబ్బులే. దేశంలో మూడో సారి మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక తెలంగాణలో, ప్రతి పేద కుటుంబానికి రానున్న 5 ఎండ్లలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయొచ్చు.