నారా లోకేష్‌ కాన్వాయ్‌ తనిఖీ

అమరావతి, మహానాడు : ఉండవల్లి కరకట్ట వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కాన్వాయ్‌ని పోలీసులు ఆపి తనిఖీ చేసిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున విధుల్లో బాగంగా తనిఖీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. తనిఖీలకు లోకేష్‌ సహకరించారు. కాన్వాయ్‌లో ఉన్న కార్లన్నింటినీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి లోకేష్‌ వెళ్తున్నారు. కాన్వాయ్‌లో కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని పోలీసులు నిర్ధారించాక వెళ్ళేందుకు అనుమతించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా లోకేష్‌ ప్రచారం సాగుతోందని పోలీసుల తెలిపారు.