రోజూ పారిశుద్ధ్య పనుల పరిశీలన

– ఎమ్మెల్యే చదలవాడ

నరసరావుపేట, మహానాడు: స్థానిక కోడెల శివప్రసాద్ రావు స్టేడియంలో ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు మంగళవారం పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదాచారాకులకు, ఆటలు ఆడే పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. స్వయంగా స్టేడియం ప్రాంగణంలో గడ్డి నివారణ మందులు స్ప్రై చేశారు. పట్టణం లో ప్రతి రోజు పర్యటిస్తా… పారిశుద్ధ్య పనుల్లో లోపాలు జరిగితే సాహించిదే లేదన్నారు. ఈ కార్యక్రమంలో తాండవ కృష్ణ, వాసిరెడ్డి రవీంద్ర, అల్లూరి కోటి, శేఖర్, చంద్రమౌళి, కన్నెధర రాజు, దండా శివరామకృష్ణ, జాగార్లమూడి హనుమంతరావు మోహనరావు, శానిటేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.