ఏపీలో భూ కుంభకోణాలపై విచారణ చేయాలి

మాజీ అధికారి పి.వి.రమేష్‌ డిమాండ్‌

అమరావతి: రాష్ట్రంలో 1953లో లక్షలాది ఎకరాలను పేదలకు అసైన్‌ చేశారని, ప్రస్తుత ప్రభుత్వం 2023లో చట్టానికి సవరణ చేసిందని మాజీ అధికారి పీవీ రమేష్‌ తెలిపారు. దీంతో చట్టం భూకబ్జాదారులకు ఓ వరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల ఎకరాలు చేతులు మారిపోయే ప్రమాదం ఉందన్నారు. తక్షణం ఏపీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌, అసైన్డ్‌ ల్యాండ్స్‌ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వాటిపై విచారణ చేయించాలని, దాని వెనుక కుంభకోణాలను బయటపెట్టాలని కోరారు.