దసరా ఉత్సవాలకు మంత్రి లోకేష్‌కు ఆహ్వానం

అమరావతి, మహానాడు: దేవీ నవరాత్రి ఉత్సవాలకు మంత్రి నారా లోకేష్ ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అమరావతి సచివాలయంలో సోమవారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ్ సత్యనారాయణ, శ్రీశైలం, విజయవాడ దేవస్థాన ఇఓలు.. వేద పండితులతో కలిసి దసరా ఉత్సవాలకు గౌరవప్రదంగా ఆహ్వానించారు. వేద ఆశీర్వచనాలతో లోకేష్ ను వేద పండితులు ఆశీర్వదించగా, ఘనంగా సత్కరించి శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేయాలని ఆహ్వాన పత్రికలు అందజేశారు.