అమరావతి, మహానాడు: వైసీపీ సోషల్ మీడియా నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ పై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ నేత ఇంటూరు రవికిరణ్ పై తూర్పు గోదావరి జిల్లా ప్రకాష్ నగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఇంటూరు రవికిరణ్ పై కడియం పీఎస్ లోనూ కేసు నమోదు అయింది. కోనసీమ జిల్లాలోని వివిధ పీఎస్‌ల్లో 5 ఫిర్యాదులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసిన మాజీ ఎంపీ మార్గాని భరత్‌పై త్రీటౌన్ పీఎస్‌లో కేసు నమోదు అయింది.