Mahanaadu-Logo-PNG-Large

ఆస్కార్‌ గ్రహీత కీరవాణి సంగీతం ఇస్తే తప్పేంది?

-సిగ్గుగా లేదా కేసీఆర్‌..ఇవిగో మీ ఘనకార్యాలు
-టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి

హైదరాబాద్‌: టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి గురువారం మీడియా సమావేశంలో కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌, కేటీఆర్‌ మీ ప్రభుత్వంలో మీరు చేసిన ఘనకార్యాలు గుర్తు తెచ్చుకోండి. తెలంగాణకు చెందిన గాయకుడు అందెశ్రీ పాడిన గేయానికి సంగీతం ఆస్కార్‌ అవార్డు కీరవాణి అందిస్తే తప్పింటి? అని ప్రశ్నించారు. గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించకపోవడం సిగ్గుచేటు. దాన్ని రాష్ట్ర గీతంగా ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ గుర్తించి తీసుకోవడం ఆమోదిం చవలసిన విషయమని వ్యాఖ్యానించారు. దానికి గగ్గోలు పెట్టడం మీకు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. రాజముద్రలో అమరవీరు స్తూపం ఉంటే తప్పేమిటి? అమర వీరుల త్యాగాల ఫలితంగా రాష్ట్రం వచ్చిందని గుర్తుచేశారు. మీ పాలనలో చేసిన ఘనకార్యాలను గుర్తుతెచ్చుకోవాలని తెలిపారు. కవితమ్మ బతుకమ్మ పాటలు ఏఆర్‌ రెహమాన్‌ పాడిస్తే అది ఆంధ్రుడు కాదా? చిన్న జీయర్‌ స్వామి ట్రస్టుకు ఎకరానికి 12 కోట్ల విలువైన భూమిని రూ.16 లక్షలకు కట్టబెట్టారు..వారు ఆంధ్రుడు కాదా? కాలేశ్వరం ప్రాజెక్టును లక్షల కోట్ల విలువ గల కాంట్రాక్టును మేఘ కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు.ఆయన ఆంధ్రుడు కాదా? యాదగిరిగుట్ట డిజైను ఆనంద్‌ సాయికి ఇచ్చారు. ఆయన ఆంధ్రుడు కాదా? హీరోయిన్‌ సమంతకు మన బ్రాండ్‌ అంబాసిడర్‌ చేశారు. కోట్ల రూపాయలు ఇచారు. ఆమె ఆంధ్ర కాదా? శారదా పీఠానికి రెండు కోట్ల విలులైన భూమిని ఒక రూపాయికి కట్టబెట్టారు. వారు ఆంధ్రులు కాదా? అని ప్రశ్నించారు.