• IB విద్యావిధానం, EDX లాంటి సంస్థల్ని రాష్ట్ర విద్యారంగంలోకి చొప్పించాలనే నిర్ణయాలు జగన్ రెడ్డి ఎవరిని సంప్రదించి తీసుకున్నారు?
• రాష్ట్రంలోని పాఠశాలల స్థితిగతులు.. విద్యార్థుల మేథాసంపత్తి గురించి ముఖ్యమంత్రి ఆలోచించారా?
• విద్యార్థులు..ఉపాధ్యాయులు..తల్లిదండ్రులతో చర్చించారా?
– టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్
విద్యారంగం పరిపుష్టి గురించి, విద్యార్థుల భవిష్యత్ గురించి పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు విద్యారంగంలో జగన్ రెడ్డి చేసిన ప్రయోగాలతో వస్తున్న ఫలితా విద్యా ప్రమాణాలను పూర్తిగా దిగజారుస్తున్నాయని ఆ క్రమంలో వైసీపీప్రభుత్వం కొత్తగా ఏపీలో ప్రవేశపెట్టిన IB (International Baccalaureate) విద్యా విధాన మైతే, రెండోది ఆన్ లైన్ విధానంలో విద్యాబోధన కోసం ఎడెక్స్ అనే సంస్థకు రూ.50కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడమని ఇలాంటి నూతన విధానాలు ప్రవేశపెట్టే ముం దు విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రతిపక్షాల అభిప్రాయలు తీసుకోవ డం సహజమని, కానీ జగన్ రెడ్డి అలాంటివేవీ చేయకుండా ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తున్నాడని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయ పాలెం విజయ్ కుమార్ ఆరోపించారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…“జగన్ రెడ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, మరో ఇద్దరు విద్యాశాఖ అధికారులే కొత్త విద్యావిధానాలపై నిర్ణయం తీసేసుకు న్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతంలో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశపెట్టామని, సీబీఎస్ఈ సిలబస్ తీసుకొచ్చామని, బైజూస్ విద్యావిధానమని, ట్యాబ్ ల పంపిణీ (సుమారు 10లక్షల ట్యాబ్ లు) అని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకున్నారు.
వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి… విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుం దా…బోధనాంశాలు వారికి అర్థమవుతున్నాయా అనే అంశాలేవీ ఈ ముఖ్యమంత్రికి పట్టడంలేదు. విద్యార్థులు… ఉపాధ్యాయులు ఏమైపోతే నాకేంటి, నేను అనుకున్నదే జరగాలనే ధోరణితో ఉన్న ముఖ్యమంత్రి కొత్తగా ప్రవేశపెట్టాలను కుంటున్న IB విద్యావిధానం తీరుతెన్నులు ఎలా ఉంటాయని ఆలోచించారా? ఏమైనా పరిశీలించి.. పరిశోధించారా? అంటే …అవేం జరగలేదు. IB విద్యావిధానం అమలుచేయాలంటే ప్రాథమిక పాఠశాలకే సంవత్సరానికి రూ.50 నుంచి రూ.70 లక్షలవరకు ఖర్చవుతోంది.
ఇంత వ్యయంతో కూడిన విద్యావిధానాన్ని రాష్ట్రంలోని పేద, సామాన్య కుటుంబాల విద్యార్థులు భరించగలరా? ఒక సాధారణ ప్రాథమిక పాఠశాల ఈస్థాయిలో సొమ్ము కట్టడం సాధ్యమయ్యే పనేనా? అదలా ఉంటే మరలా విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకోసం అదనంగా సబ్జెక్ట్ ల వారీగా చెల్లించాలి. అవి కూడా కలిపితే ఒక్కో ప్రాథమిక పాఠశాలకు సంవత్సరానికి రూ. 50 నుంచి రూ.70 లక్ష ల వరకు భారం పడుతుంది. ఇంత వ్యయంతో కూడిన విద్యావిధానం వల్ల ఎలాంటి ఫలితా లు వస్తాయో, విద్యార్థులకు జరిగే మేలేమిటో ముఖ్యమంత్రి చెప్పాలి.