Mahanaadu-Logo-PNG-Large

ప్రజాపాలన అంటే పిల్లలాటగా ఉందా?

-ప్రభుత్వ గుర్తులు మార్చడం తుగ్లక్‌ చర్య
-మార్చాల్సి ఉంటే ప్రజలను ఒప్పించాలి
-లేకుంటే అసెంబ్లీలో చర్చ జరగాలి
-బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ ట్వీట్‌
-అధికారిక చిహ్నం మార్పుపై మండిపాటు

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నేత, నగర ఇన్‌చార్జ్‌ దాసోజు శ్రవణ్‌ ట్విట్టర్‌ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజల జీవితాలలో మార్పు తెస్తానని అధికారం హస్తగతం చేసుకుని ప్రజాభ్యుదయానికి సంబంధం లేకుండా ప్రభుత్వ గుర్తులను మార్చి తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను తుడిచివేసే పనిలో పడటం తన అవివేకానికి, మూర్ఖత్వానికి మరుగుజ్జు మనస్తత్వానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రభుత్వ గుర్తులు మార్చడం తుగ్లక్‌ చర్యగా అభివర్ణించారు. ఓకే వేళ రేపో మాపో భవిష్యత్తులో రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వస్తే ఆ తరువాత వచ్చే కొత్త ముఖ్యమం త్రి మరో కొత్త లోగో తేవాలా? ఏందీ తమాషా? ప్రజా పాలన అంటే పిల్లలాటగా ఉందా? ఉందా అని ప్రశ్నించారు. ఒకవేళ మార్చాల్సిన అవసరమే ఉంటే ప్రజల ను ఒప్పించి మెప్పించండి. అలాకాకుండా ముఖ్యమంత్రి, ఆయన వందిమాగధుల స్వంత నిర్ణయం కాకూడదని మండిపడ్డారు. అన్ని వర్గాలకు చెందిన సంప్రదిం పుల నిర్ణయం కావాలి.. కనీసం అసెంబ్లీలో అయినా చర్చ జరగాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఏది పడితే అది చేయడానికి ముఖ్యమంత్రి రాజు కాదు…కేవలం ప్రధాన సేవకుడు మాత్రమే…అదికూడా శాశ్వతం కాదని వ్యాఖ్యానించారు.