– సజ్జలే షాడో ముఖ్యమంత్రా? ఆయనతో మేం చర్చించేదేమిటి?
– రాష్ట్రానికి ఏం సాధించాడని జగన్ రెడ్డి టీడీపీతో చర్చకు వస్తాడు?
• తెలుగుదేశంపై విమర్శలు చేయడానికి…చంద్రబాబుపై నిందలు వేయడానికే సజ్జల సలహాదారుగా ఉన్నాడా?
• తన సలహాలతో సజ్జలే జగన్ ను చెడగొడుతున్నాడా? పార్టీలో ఎవరికి సీట్లు ఇవ్వాలో కూడా సజ్జలే చెబుతున్నాడా?
• సజ్జలే షాడో ముఖ్యమంత్రా.. ఆయనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడా?
– మాజీ మంత్రి కే.ఎస్.జవహర్
టీడీపీ విసిరే ఏ సవాల్ ను స్వీకరించే పరిస్థితిలో జగన్ రెడ్డి లేడని, అసత్యాలతో రాష్ట్రప్రజల్ని మరోసారి మోసగించే ప్రయత్నాల్లో తీరికలేకుండా ఉన్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
బలహీనవర్గాలకు చెందిన 120 పథకాలు..27 దళితుల పథకాలు రద్దుచేసిన జగన్ రెడ్డి నిస్సిగ్గుగా పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటున్నాడు
“ మద్యపాన నిషేధం.. సీపీఎస్ రద్దు సహా పలుహామీలతో అధికారంలోకి వచ్చిన జగన్, ముఖ్యమంత్రి అయ్యాక కుంటిసాకులు చెప్పి ప్రజల్ని ఏమార్చే పనిలో పడ్డాడు. చంద్రబాబు హాయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పెళ్లికాని యువతులకు పెళ్లికానుక కింద ఆర్థికసాయం అందింది. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ఆ పథకం పూర్తిగా అటకెక్కింది. దళితులకు సంబంధించిన 27 పథకాల్ని రద్దుచేసిన జగన్ రెడ్డి.. నిస్సిగ్గుగా పేదలకు.. పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోంది అంటున్నాడు. తండ్రి ముఖ్యమంత్రి కాకముందు రూ.లక్షా60వేలున్న జగన్ ఆస్తి..నేడు లక్షలకోట్లకు ఎలా పెరిగింది? భార్య..ఇద్దరు పిల్లలతో ఉండటానికి భారీ ప్యాలెస్ లు నిర్మించుకున్న జగన్ రెడ్డి నిజంగా పేదవాడే
ఎవరు పెత్తందారు జగన్ రెడ్డి? నీ తండ్రి ముఖ్యమంత్రి కాకముందు నీ ఆస్తి ఎంత ? ఇప్పుడు నీకున్న ఆస్తులెన్ని? అప్పుడు రూ.1,60,000లు ఉన్న జగన్ ఆస్తి, నేడు లక్షలకోట్లు ఎలా అయ్యింది? తన ఇద్దరు పిల్లలు, భార్యతో నివాసం ఉండ టానికి బెంగుళూరులో 23 ఎకరాల్లో 60గదులతో రాజమహల్ నిర్మించుకున్న జగన్ రెడ్డి పేదవాడా? జూబ్లీహిల్స్ లోని లోటస్ పాండ్, తాడేపల్లి ప్యాలెస్, ఇడుపుల పాయలోని రాజభవనాలు నీవి కావా జగన్ రెడ్డి? జగన్ రెడ్డి పేదవాడు అనడానికి ఇవే ఉదాహరణలు.
ఇడుపులపాయలో 650 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది. వీటన్నింటితో పాటు కడపలో మరో విలాసవంతమైన భవనం ఉంది. ఇవన్నీ జగన్ రెడ్డి పేదరికానికి నిలువెత్తు నిదర్శనాలు. ఉన్న ఆస్తులు..భవనాలు చాలవ న్నట్టు విశాఖపట్నంలో రూ.500కోట్ల ప్రజలసొమ్ముతో ఏకంగా రుషికొండపైనే మరో భారీ ప్యాలెస్ నిర్మించుకుంటున్నాడు. ఇన్ని పెద్ద భవనాలున్నా…ఏదైనా తేడా వచ్చి దేశంవిడిచి పారిపోవాల్సి వస్తే లండన్లో తలదాచుకోవడానికి అక్కడ ముందే ఒక భారీభవనం కొని పెట్టుకున్నాడు.
భారతి సిమెంట్స్.. సండూర్ పవర్.. సాక్షి మీడియా సంగతేంటి జగన్ రెడ్డి?
జగన్ రెడ్డికి భారీ నివాస సముదాయాలతో పాటు… వాణిజ్య, వ్యాపార కేంద్రాలు కూడా ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది భారతి సిమెంట్స్. దానికి తోడు సాక్షి దినపత్రిక.. సాక్షి ఛానల్.. బెంగుళూరులోని మంత్రి డెవలపర్స్ పేరుతో ఉన్న భారీ షాపింగ్ కాంప్లెక్స్, బంజారాహిల్స్ లోని రూ.100కోట్ల భవనం, సరస్వతి పవర్స్ , సండూర్ పవర్ పరిశ్రమలు. ఇవన్నీ చాలవన్నట్టు జింకా వెంకట నర్స య్య అనే బీసీని చంపి ఆక్రమించుకున్న గనులు, పెనగలూరులో ఉన్న 600 ఎకరాల టేకు తోట ఇలా పైకి తెలిసిన ఆస్తులుకొన్నే. తెలియకుండా జగన్ పేరుతో.. ఆయన కుటుంబసభ్యులు.. బినామీ పేర్లతో ఉన్నవి ఎన్నో.
చంద్రబాబు అందించిన సంక్షేమంతో పోలిస్తే జగన్ రెడ్డి అమలుచేసిన సంక్షేమం ఆవగింజంతే
చంద్రబాబు గతంలో ప్రజలకు అందించిన సంక్షేమం ఆకాశమంత అయితే, ఈ 5ఏళ్లలో జగన్ రెడ్డి అందించింది ఆవగింజంతే. ఆవగింజంత సంక్షేమానికి అనకొండంత ప్రచారం చేసుకొని, తానే పేదల్ని ఉద్ధరించినట్టు జగన్ గొప్పలు చెప్పుకుంటున్నాడు. చేసింది చెప్పుకోనందువల్ల చంద్రబాబు ప్రజలకు అందించిన సంక్షేమం ప్రాచుర్యం లోకి రాలేదు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు మలుపు, ముందడుగు అనే పథకాలు తీసుకొచ్చారు. జగన్ రెడ్డికి తెలిసిన సంక్షేమం.. హత్యలు, దాడులుచేయించడమే చంద్రబాబు అమలు చేసింది అసలైన సంక్షేమం.. ఆత్మగౌరవంతో బతికేలా చేసిన సంక్షేమం.
జగన్ రెడ్డికి తెలిసిన సంక్షేమం ఏమిటంటే .. బాబాయ్ ను చంపి బాత్రూమ్ లో పడుకోబెట్టడం.. తమ్ముడు అవినాశ్ రెడ్డి జైలుకెళ్లకుండా కాపాడటం.. దళితుల్ని చంపినవారికి పదవులు కట్టబెట్టడం.. వారికి ఊరేగింపులు, సన్మానాలు చేయడం.. కోర్టుకు వెళ్లకుండా 5 ఏళ్లపాటు కోడికత్తి కేసులో దళితయువకుడు శ్రీనివాస్ జైల్లో మగ్గేలా చేయడం…బలహీనవర్గాల వారిపై వైసీపీనేతలతో దాడులు చేయించడం…వారి రిజర్వేషన్లలో కోతపెట్టి, స్థానికసంస్థల్లో వారికి దక్కా ల్సిన పదవులు దక్కకుండా చేయడం. ఇవీ జగన్ రెడ్డికి తెలిసిన సంక్షేమ పథకాలు.
తన సలహాలతో సజ్జలే.. జగన్ ను చెడగొడుతున్నాడా? సజ్జలే షాడో ముఖ్యమంత్రా? ఆయనతో మేం చర్చించేదేమిటి? టీడీపీ సవాల్ పై మాట్లాడటానికి సజ్జల ఎవరు? తెలుగుదేశంపై విమర్శలు చేయడానికి…చంద్రబాబుపై నిందలు వేయడానికే సజ్జల సలహాదారుగా ఉన్నాడా? ఆవభూములు సహా నివాసానికి పనికిరాని భూముల్ని పేదలకు ఇళ్లస్థలాలుగా ఇవ్వమనే మంచి సలహా సజ్జలే ఇచ్చాడా? తన సలహాలతో సజ్జలే జగన్ ను చెడగొడుతున్నాడా? పార్టీలో ఎవరికి సీట్లు ఇవ్వాలో కూడా సజ్జలే చెబుతున్నాడా? సజ్జలే షాడో ముఖ్యమంత్రా.. ఆయనే రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడా? ఆయనతో చర్చలేమిటి” అని జవహర్ ప్రశ్నించారు