కొడుకు షాడో ఎమ్మెల్యే అంట కదా…
ప్రతి పనిలో ఒక రేట్ ఫిక్స్ చేస్తారట
మట్టి, ఇసుక మాఫియాలో సంపాదించాడట
డబ్బులిస్తే తీసుకోండి…ఓటు మాత్రం వేయకండి
కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్.షర్మిలారెడ్డి
చిత్తూరు జిల్లా సత్యవేడు, మహానాడు : పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వై.ఎస్?షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగం గా ఆదివారం చిత్తూరు జిల్లా సత్యవేడులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యవేడు ఎమ్మెల్యే ఉన్నాడా? లేడా? ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నార ట.. కొడుకు షాడో ఎమ్మెల్యే అంట కదా అని అడిగారు. ప్రతి పనిలో ఒక రేట్ ఫిక్స్ చేస్తారట కదా.. మొత్తం మట్టి, ఇసుక మాఫియా. ఈయన వైసీపీ నుంచి టీడీపీ వెళ్లాడట. మళ్లీ డబ్బులు బాగా ఇస్తాడట కదా. ఎన్ని ఇచ్చినా తీసుకోండి. ఓటు ఎవరు వేయాలో ఆలోచన చేయండని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ హయాంలో ఇక్కడ శ్రీ సిటి పెట్టారు. 300 పరిశ్రమలు తెచ్చారు..లక్షమందికి ఉద్యోగాలు ఇచ్చారు..గాలేరు – నగరి ద్వారా ఇక్కడ ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలని అనుకున్నారు. 10 శాతం పనులు పెండిరగ్‌లో ఉంటే ఐదేళ్లు బాబుకి, ఇప్పుడు జగన్‌కి పూర్తి చేయడం చేతకాలేదు. రాష్ట్రాన్ని 10 ఏళ్లలో సర్వనాశనం చేశారు. మనకు రాజధాని లేకుండా చేశారు.
ఇంకా హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వైపు చూడాల్సిన పరిస్థితి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదన్నారు. బాబు, జగన్ ఇద్దరు బీజేపీకి ఇద్దరు బానిసలు అయ్యారని, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని విమర్శించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల కుప్ప చేశాడు. దేనికి డబ్బు లేదట. బటన్ నొక్కడం ..ఒకవైపు నుంచి లాక్కోవడం ఇదేనా పాలన అని ప్రశ్నించారు. మద్య నిషేధం అని చెప్పి కల్తీ మద్యం అమ్ముతున్నారు. సర్కారే మద్యం అమ్ముతుంది. 60 బాటిల్ 260 రూపాయలట. బూమ్ బూమ్ బీర్లట… స్పెషల్ స్టేటస్ విస్కీ అంట. డీఎస్సీ బ్రాం డి అంట..జగన్ హామీలు అన్ని మద్యం షేపులో కనిపిస్తున్నాయని విమర్శించా రు. రాష్ట్రం అభివృద్ది కావాలి అంటే కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తే 10 ఏళ్లు ప్రత్యేక హోదా, ఇళ్లులేని పేద కుటుంబానికి 5 లక్షలతో ఇల్లు, ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద ఏటా లక్ష రూపా యలు, ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ, వృద్దులకు, వితంతువులకు 4 వేల పెన్షన్, వికలాంగులకు 6 వేల పెన్షన్, ఉపాధి పథకం కింద రోజు రూ.400 ఇస్తామని తెలిపారు. సత్యవేడులో బాలగురవం బాబును ఎమ్మెల్యేగా, ఎంపీగా చింతా మోహన్‌ను గెలిపించాలని కోరారు.