-కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం
-ఆయనను తప్పించి సిట్‌తో విచారణ జరిపించాలి
-జవహర్‌రెడ్డి, ఆయన కొడుకు, తాడేపల్లి పెద్దల హస్తం
-భూ దందా ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
-టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమమహేశ్వరరావు
విజయవాడ : ఉత్తరాంధ్రలో పెద్దఎత్తున భూ దోపిడీ జరిగినా చర్యలు లేకపోవ డం సిగ్గుచేటని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ మండిపడ్డారు. సీఎస్ ప్రమేయంపై ఆధారాలున్నా చర్యలు ఉండవా? అని ప్రశ్నించారు. సీఎం, ఆయన బంధువుల అండతో కుంభకోణానికి పాల్పడ్డారు. భోగాపురం మండలంలో సీఎస్ రూ.2 వేల కోట్ల భూకుంభకోణం చేశారు. జీవో 596 ద్వారా డీఫామ్ పట్టాలను కొట్టేస్తున్న తీరుపై ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం తీరుపై చర్యలు లేవు. ఎన్నికల సంఘానికి చాలాసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సీఎస్ జవహర్ రెడ్డి అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం. సీఎస్‌ను బాధ్యతల నుంచి తప్పించి సిట్ విచారణ జరిపిం చాలి. డీ పట్టాలన్నీ సీజ్ చేసి అధికారులందరిపైనా విచారణ జరిపించాలి. విచారణ కోరకుండా ఆరోపణలు చేసిన వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సీఎస్, ఆయన కుమారుడు, తాడేపల్లి పెద్దలు కలిసి భూదోపిడీకి పాల్పడ్డారు. నిజాలు వెలికి తీసిన వ్యక్తులను సీఎస్ బెదిరిస్తున్నారు. జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మా ఆరోపణలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.