ప్రజా పాలన అంటే ఇదేనా..?

బీజేపీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు 

పదేళ్లు దొరల పాలన సాగింది. ప్రజా పాలన పేరు మీద మరొక పాలన మొదలైంది. ఆరు నెలల కాలంలోనే ప్రజా పాలన అంటే ఏంటో ప్రజలకు అర్థమయ్యింది. రాష్ట్రానికి శని పట్టుకున్నట్టు ఒక పాలన పోతే మరొక పాలన వచ్చి మోపైంది అని బీజేపీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్లు  అన్నారు. కేసీఆర్ కు పదేళ్లు పడితే ఆరు నెలల్లోనే రేవంత్ పాలన ప్రజలకు దూరమయ్యింది. చిక్కడపల్లి లైబ్రరీ చుట్టూ పోలీసుల కంచెలు దర్శనమిస్తున్నాయి. పోలీసుల పహారాలో నిరుద్యోగులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తుందా లేక నిర్భాంధాల పాలన కొనసాగుతుందా..? ఉస్మానియా విద్యార్థులను బీరు బిర్యానీ గాళ్ళు అని రేవంత్ హేళన చేసి మాట్లాడుతున్నారు. ఇచ్చిన హామీలను అడుగుతున్నాం ఎప్పుడు అమలు చేస్తారు..? జాబ్ క్యాలేండర్ కోసం కమిటీ వేయాల్సిన అవసరం ఏముంది..? అధికారంలోకి రాకముందు నిరుద్యోగులు, అధికారంలోకి వచ్చాక బీరు బిర్యానీ గాళ్ళవుతారా..? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.

రాష్ట్రంలో స్వయం ప్రకటిత మేధావులు ఎక్కడున్నారు..? ఆకునూరి మురళీ, కోదండ రామ్, హరగోపాల్ గొంతులు ఎటు పోయాయి..? ఉద్యమాల ద్వారానే రేవంత్ రెడ్డి మెడలు వంచుతాం. నిరుద్యోగుల వైపుకు నిలబడుతాం. దొరల రాజ్యం పోయి, దొంగల రాజ్యం వచ్చింది. బెల్ట్ షాపులు రద్దు జేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. 40 ఎలివెటెడ్ బార్లను తెచ్చేందుకు సమీక్షలు నిర్వహించడం దుర్మార్గం.

ప్రజా పాలన అంటే ఇదేనా..? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే రాష్ట్రానికి శని పట్టుకుంది. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను గనుక ప్రకటించకపోతే రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి ప్రజా పాలనను అడుగడుగునా దిగ్బంధిస్తాం. రెండు లక్షల ఉద్యోగాలకు ఒక్క ఉద్యోగం తగ్గిన ఊరుకునేది లేదు. ఇంద్ర పార్క్ వేదిక నుంచి రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం అని అన్నారు.