ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, మహానాడు : హైదరాబాదులో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని ప్రజలు శుభసూచకంగా భావిస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నఅన్నారు. రాష్ట్రాలు విడిపోయినా అన్నదమ్ముల్లా విభజన హామీల పరిష్కారం కోసం చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ పట్ల ఉన్న ప్రేమ అర్ధమవుతుంది. ప్రజల ఆకాంక్షల మేరకు ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుతుంటే.. దీనిని రాజకీయంగా ఉపయోగించుకొని బురద జల్లాలని బీఆర్ఎస్ చూస్తోంది. కేసీఆర్, ఆయన పరివారానికి మనసున పట్టడం లేదు. తమలాగా ప్రజలను మభ్య పెట్టాలి అన్నట్లు చూస్తున్నారు. కేసీఆర్, జగన్ లు పదేళ్లు స్వార్థ రాజకీయాల తప్ప సమస్యల పరిష్కారం కోసం చర్చ చేయలేదు. రోజా ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని కేసీఆర్ అన్నాడు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు 7 మండలాలు ఆంధ్రలో కలిపారన్నారు. హంతకులే సంతాపం తెలిపినట్లు చేస్తున్నారు. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పని చేస్తుంది. ఆంధ్ర నుంచి రావాల్సిన వాటా వదిలిపెట్టి ఇక్కడి సంపద అక్కడికి తరలించారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు.