మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం సంతోషం

– బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, టీడీపి బ్రాహ్మణ సాధికారక సమితి రాష్ట్ర సభ్యురాలు తడకపల్లి సుధ

మంగళగిరి: పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడం పట్ల మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, టిడిపి బ్రాహ్మణ సాధికారక సమితి రాష్ట్ర సభ్యురాలు తడకపల్లి సుధ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తడకపల్లి సుధ మాట్లాడుతూ…ఆంధ్రదేశంలో కొంత కాలం క్రితం వరకు డొక్కా సీతమ్మ పేరు తెలియని వారు ఉండేవారు కాదని, ఆమె అన్నదానం ఖ్యాతి ఖండ ఖండాంతరాల్లో నూ వ్యాపించిందని కొనియాడారు.

బ్రాహ్మణ సమాజంలో పుట్టిన ఆమె 180 ఏళ్ల క్రితమే ఆకలి అంటూ వచ్చిన వారందరి కడుపు నింపిన గొప్ప మనసు డొక్కా సీతమ్మ సొంతమని అన్నారు.ఆస్తులు కరిగిపోయినా, కష్టాలు కుంగదీసినా, చరమాంకం వరకు నిత్యాన్నదానం కొనసాగించి ఆంధ్ర అన్నపూర్ణమ్మగా కీర్తిగా గావింపబడ్డారని అన్నంపెట్టే అమ్మగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. అలాంటి మహాత్మురాలి గొప్పతనాన్ని గుర్తించి ఆమె పేరు మధ్యాహ్న భోజన పథకానికి పెట్టిన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.