– ప్రజాపాలనకు ‘వంద ’నాలు
– ఇక సుపరిపాలనే.. కూటమి పాలనపై సర్వత్రా హర్షాతిరేకాలు
– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
వీరులపాడు మండలం (చెన్నారావుపాలెం): ఐదేళ్ల పాటు అరాచక పాలన చూసి విసుగు చెందాం, రానున్న ఐదేళ్లు సుపరిపాలన చూస్తారని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం చెన్నారావుపాలెం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు.
వంద రోజుల కూటమి పాలనలో చేకూరిన లబ్ధిపై నేరుగా లబ్ధిదారులతో మాట్లాడేందుకుగాను సీఎం చంద్రబాబు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గ్రామ స్వచ్ఛతాహి సేవ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ‘ఇది మంచి ప్రభుత్వం’ స్టిక్కర్లను ఇంటింటికీ వెళ్లి అతికించారు.